Telangana: స్మగ్లర్లు బీకేర్‌ఫుల్‌..! ఖాకీల నుంచి తప్పించుకోవచ్చేమో..! వీటి నుంచి నో ఛాన్స్‌!

స్నీఫర్ డాగ్స్ గంజాయి స్మగ్లర్లకు చెమటలు పట్టిస్తున్నాయి. మత్తు పదార్థాలను పసి కట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Telangana: స్మగ్లర్లు బీకేర్‌ఫుల్‌..! ఖాకీల నుంచి తప్పించుకోవచ్చేమో..! వీటి నుంచి నో ఛాన్స్‌!
Sniffer Dogs
Follow us
G Peddeesh Kumar

| Edited By: Balaraju Goud

Updated on: Nov 13, 2024 | 11:20 AM

నేరస్తులను పసిగట్టడం.. ల్యాండ్ మైండ్స్, పేలుడు పదార్థాలను గుర్తించడంలో పోలీస్ శాఖకు అందివచ్చిన ఆయుధంగా ఉపయోగపడే స్నీఫర్ డాగ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నాయో తెలుసా..? ఆ స్మగ్లర్లకు ఎలా మత్తు వదిలిస్తున్నాయో తెలుసా..? క్లాస్ గా తయారై సూట్ కేసులతో మాదకద్రవ్యాలు సరఫరా చేసేవారిని ఓ పని పట్టుబడుతున్నాయి. మేడల మీద మూడో కంటికి తెలియకుండా గంజాయి సాగు చేసేవారిని పోలీసులకు పట్టిస్తున్నాయి. మత్తు వదిలిస్తున్న ఆ స్నీఫర్ డాగ్స్ సరికొత్త రికార్డుల కతేంటో మీరే తెలుసుకోండి..!

గంజాయి స్మగ్లర్లు తెలివి మీరు పోయారు.. పుష్ప సినిమాను తలపించే తరహాలో కొత్త కొత్త మార్గాల్లో గంజాయి తరలిస్తున్నారు. వారిని సాధారణ తనిఖీల్లో పట్టుకోవడం ఖాకీలకు అసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు మాదకద్రవ్యాలను పట్టించడంలో స్నీఫర్ డాగ్స్ పాత్ర ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది

స్నీఫర్ డాగ్స్ గంజాయి స్మగ్లర్లకు చెమటలు పట్టిస్తున్నాయి. మత్తు పదార్థాలను పసి కట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాధారణంగా వీఐపీల భద్రత, ల్యాండ్ మెంట్ పసిగట్టడం, ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు నేరస్తులను గుర్తించడంలో కీలక పాత్ర పోషించే స్లీపర్ డాగ్స్ ఇప్పుడు గంజాయి తోపాటు మత్తు పదార్థాలను పసిగట్టడంలో పోలీస్ శాఖకు అందివచ్చిన ఆయుధంగా మారాయి.

రాష్ట్ర ప్రభుత్వం గంజాయి రవాణా, విక్రయాలను నియంత్రించడం కోసం యాంటి డ్రగ్స్ టీమ్స్, టాస్క్ ఫోర్స్ ఇతర నిఘా విభాగాలని ఏర్పాటు చేసింది. వారికి సాధారణ తనిఖీల్లో పట్టుబడకుండా స్మగ్లర్లు జాగ్రత్త పడుతున్నారు. ఈ నేపథ్యంలో మత్తు పాదార్దాలను పసిగట్టడం, గంజాయి రవాణా నియంత్రించడానికి స్నిఫర్ డాగ్స్ ను ఉపయోగిస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో స్నీఫర్ డాగ్స్ యాంటి డ్రగ్స్ టీమ్స్ గంజాయి రవాణాను పసిగట్టడంలో కీలకంగా మారాయి. ఈ స్నీఫర్ డాగ్స్ గంజాయి రవాణాచేస్తున్న వారిని పసిగట్టి స్మగ్లర్లను పోలీసులకు పట్టించాయి. గడిచిన ఏడాది వ్యవదిలో వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో 11 ఘటనల్లో ఈ స్నిఫర్ డాగ్స్ గంజాయిని వాసన పసిగట్టి నేరస్తులను పట్టించాయి.

అయితే రైలు మార్గాలు, బస్సు మార్గాలో ఎవరు గుర్తించిన విధంగా క్లాస్ గా తయారై సూట్ కేసులో గంజాయి ప్యాక్ చేసి మూడో కంటికి తెలియకుండా గంజాయి రవాణా చేస్తున్నారు.. గంజాయి వాసన బయటికి రాకుండా ప్యాకింగ్ చేసి తరలించే స్మగ్లర్లు ఈ స్నీఫర్ డాగ్స్ కు అడ్డంగా దొరికిపోతున్నారు.

సాధారణంగా గంజాయి షీల్డ్ కవర్లో ప్యాక్ చేసి సూట్ కేసులు, బ్యాగ్ లలో సాధారణ లగేజ్ లాగానే తీసుకువెళ్తున్నారు.. ఈ క్రమంలోనే స్నీఫర్ డాగ్స్ ఆ బ్యాగ్ లో తరలిస్తున్న గంజాయిని పసిగట్టి పోలీసులకు పట్టిస్తున్నాయి..సాధారణ తనిఖీలలో కూడా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను వాసన పసిగట్టి పోలీసులకు నేరస్తులను పట్టిస్తున్నాయి.. దీంతో గంజాయి రవాణాను నియంత్రించడం పోలీసులకు సులభంగా మారింది.. సాధారణంగా ఎక్స్పోజివ్స్, దొంగలను పసిగట్టడం, నేరస్తుల గుర్తించే స్నిఫర్ డాగ్స్ ఇప్పుడు ఇలా మారుతున్న టెక్నాలజీకి తోడు మత్తు పదార్థాల ముఠాలను పసిగట్టి పోలీసులకు పట్టించడం పట్ల పోలీసులకు సగం శ్రమ తగ్గించినట్లయింది.. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కొత్త కొత్త నేరాలకు స్నీఫర్ డాగ్స్ ను ఉపయోగిస్తారో అన్న చర్చ జరుగుతుంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!