Telangana: మావోల అలజడితో పోలీసుల అలెర్ట్.. కూంబింగ్‌లు, ఇంటింటీ తనిఖీలతో గిరిజనుల్లో టెన్షన్
తెలంగాణలో మావోయిస్టుల అలజడి కలకలం రేపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మావోయిస్టుల దళం ఎంటరైందన్న సమాచారంతో అడవులను జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఎన్నడూలేని విధంగా ఏకంగా..
మొన్న నిర్మల్ జిల్లా, నిన్న కుమ్రంభీమ్ జిల్లా, ఇప్పుడు భూపాలపల్లి జిల్లా, వరుస కూంబింగ్‌లతో దడ పుట్టిస్తున్నారు పోలీసులు. ఏకంగా ఎస్పీలే రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో మావోయిస్టుల అలజడి కలకలం రేపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి మావోయిస్టుల దళం ఎంటరైందన్న సమాచారంతో అడవులను జల్లెడ పడుతున్నారు పోలీసులు. ఎన్నడూలేని విధంగా ఏకంగా ఎస్పీలే సీన్‌లోకి దిగుతున్నారు. ఇటీవల నిర్మల్ అండ్ కుమ్రంభీమ్ జిల్లాల ఎస్పీలు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ గిరిజనులను అలర్ట్ చేశారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు కూడా నిర్వహించారు. ఎవ్వరూ కూడా మావోయిస్టుల మాయలో పడొద్దని, సహకరించొద్దని సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కూడా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం సంచలనం రేపుతోంది. గోదావరి నదీ తీరం, తెలంగాణ-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ బోర్డర్‌లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు ఎస్పీ సురేందర్‌రెడ్డి. పలిమేల మండలంలోని ముకునూరు, గేర్రాయిగూడెం, ఇచ్చంపల్లి, నీలంపల్లి, సర్వాయిపేట, కామన్‌పల్లి గ్రామాల్లో తిరుగుతూ గిరిజనులతో మాట్లాడారు.
కాగా మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పక్కా సమాచారం ఉందన్నారు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్‌రెడ్డి. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ప్రలోభాలకు గురిచేసేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే తాము గిరిజన గ్రామాల్లో పర్యటిస్తున్నామని, ఎవ్వరూ కూడా మావోయిస్టుల మాయలో పడొద్దని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నారు ఎస్పీ. మావోయిస్టు కార్యకాలపాలకు సహకరించి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. మొన్న నిర్మల్, కుమ్రంభీమ్ జిల్లాల్లో, ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసులు కూంబింగ్ చేపట్టడంతో గిరిజన పల్లెల్లో భయాందోళనలు రేగుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..