Telangana: మవోయిస్టు పార్టీ కీలక నిర్ణయం.. కాల్పుల విరమణ పొడిగింపు.. ఎన్ని రోజులంటే?
మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కు పాదం మొపుతున్న నేపథ్యంలో తాజాగా మావోయిస్టుల నుంచి సరికొత్త ప్రకటన వెలువడింది. తెలంగాణలో కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓక లేఖ విడుదలైంది.

మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కు పాదం మొపుతున్న నేపథ్యంలో తాజాగా మావోయిస్టుల నుంచి సరికొత్త ప్రకటన వెలువడింది. తెలంగాణలో కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. గత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేసారని… ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిందని.. ఈ క్రమంలో గత మే నెలలో తాము 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించామని పేర్కొంది. గడిచిన 6 నెలల కాలంలో అనుకున్న పద్ధతులను తమ వైపు నుండి అమలు జరిపి శాంతియుత వాతావరణం కొనసాగేలాగా వ్యవహరించామని.. భవిష్యత్తులోనూ ఇలాంటి వాతావరణానే ప్రజలు కోరుకుంటున్నారని రాసుకొచ్చారు.
కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నాము. గతంలో కొనసాగిన విధంగానే మా వైపు నుండి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషిచేస్తాము. ప్రభుత్వం వైపు నుండి కూడా గతంలో వ్యవహరించిన విధంగానే సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం తెలంగాణలో నెలకొన్న శాంతి వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తోందని జగన్ తన లేఖలో తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వ దుందుడుకు చర్యలను అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, మేధావులు ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
