Telangana: చేవెళ్ల బస్సు యాక్సిడెంట్ జరిగిన సమయం ఇదే.. పూర్తి టైమ్‌లైన్ ఇదిగో
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర ప్రమాదం జరిగింది. మృత్యు శకటంలా దూసుకొచ్చిన కంకరలోడ్‌తో కూడిన లారీ బస్సును ఢీకొనడంతో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. లారీలోని కంకర ప్రయాణికులపై పడడంతో పలువురు ప్రయాణికులు ఊరిరాడక చనిపోయారు. అసలు ఈ ప్రమాదం ఎప్పుడు, ఎలా జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? వివరాలను చూద్దాం..

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో డ్రైవర్‌తో సహా 19 మంది మృతి చెందారు. బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర హైదరాబాద్-బీజాపూర్ హైవేపై ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనాస్థలిలో జేసీబీతో సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. అతివేగమే ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైంది. టిప్పర్ లారీలోని కంకర మీద పడటంతో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. 14 మందికిపైగా కంకర కిందే సమాధి అయ్యారు. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుందీ బస్సు. ఈ ప్రమాదంలో ఏడాది పాప సహా 10 మంది మహిళలు, 9 మంది పురుషులు చనిపోయారు. కంకరలో కూరుకుపోయిన ప్రయాణికులు కొందరినీ స్థానికులు రక్షించారు. సంఘటనా స్థలం దగ్గర ప్రమాదకర మలుపు ఉండగా…ఓవర్ స్పీడ్‌తో వచ్చింది టిప్పర్. ఈ వేగానికి బస్సులో పడింది టిప్పర్‌లోని కంకర. ఇదిలా ఉంటే.. ఈ ఘటన అసలు ఎప్పుడు జరిగింది.. ఏ టైంకు బస్సు బయల్దేరింది.. అనే విషయాలు ఇప్పుడు టైంలైన్‌లో చూద్దాం..
టైంలైన్ ఇలా ఉంది..
ఉ.4:40- తాండూరు నుంచి హైదరాబాద్ బయల్దేరిన బస్సు
ఉ.6:15- బస్సును ఢీకొన్న టిప్పర్
ఉ.7:00- ఘటనా స్థలికి JCB రాక
ఉ.7.05- సహాయకచర్యలు ప్రారంభం
ఉ. 7:15- స్పాట్‌కు పోలీసు సిబ్బంది
ఉ. 7:30- బస్సు నుంచి కంకర తొలగింపు ప్రారంభం
ఉ. 8:00- ఒక్కొక్కరుగా ఆసుపత్రికి క్షతగాత్రులు
ఉ. 8:30- ఒక్కొక్కటిగా మృతదేహాల వెలికితీత
ఉ.8:40- స్పాట్‌కు ఫైర్ సిబ్బంది రాక
ఉ.9:50- స్పాట్‌లో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన
ఉ. 10:00- స్పాట్‌కు అడిషనల్ డీజీ మహేష్ భగవత్
ఉ.10:15- చేవెళ్ల ఆసుపత్రికి మంత్రి పొన్నం
ఉ: 11:50- ఘటనాస్థలికి క్లూస్ టీమ్
మ.12:00- బస్సు ప్రమాద మృతుల్లో 13 మంది గుర్తింపు
ఉ. 12:05- పోస్ట్‌మార్టమ్ పూర్తయిన మృతదేహాలు అప్పగింత
