Telangana: ముగ్గురు కొడుకులు 30 ఏళ్ల వయుసులోనే దుర్మరణం… ఆ ఇంట్లో ఏం జరుగుతోంది?
శుభకార్యానికి వేసిన షామియానాలు, కుర్చీలు.. అతని చివరి మజిలీకి వినియోగించాల్సి రావడంతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రవి మరణంతో ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్న ఆయన తల్లిదండ్రులు.. భార్య ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. రవి అన్నదమ్ములిద్దరు కూడా గతంలో విద్యుత్ షాక్‌తో ఒకరు, గుండెపోటుతో మరొకరు ఇలాగే హఠాన్మరణం పొందడంతో ఆ కుటుంబాన్ని విధి పగబట్టిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు బిడ్డలను కళ్లముందే పోగొట్టుకున్న వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కుటుంబాన్ని వదిలి విదేశాలకు వెళ్లాడు.. ఏళ్ల తరబడి కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ.. ఓ ఇంటి వాడిని కావాలన్న ఆశతో కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. తన కల నెరవేరిన ఆనందాన్ని బంధుమిత్రులందరితో పంచుకుంటూ ఆదివారం నూతన గృహప్రవేశం చేశాడు. ఆ ఆనందాన్ని అనుభవించకుండానే ఆ ఇంటి యజమాని అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ విషాద సంఘటన నిర్మల్ జిల్లా ఖానపూర్‌లో చోటుచేసుకుంది. హార్ట్ ఎటాక్ భూతం ఆ ఇంటి సంతోషాన్ని మింగేసింది. ఈ సంఘటన ఆ కుటుంబలో తీరని విషాదం నింపింది.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ శ్రీరాం నగర్ కాలనీకి చెందిన 34 ఏళ్ల రవి.. గల్ప్ లో పని చేస్తున్నాడు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని భవిష్యత్తుపై కోటి ఆశలతో గల్ప్ వెళ్లిన రవి సెలవులో సొంత ఊరు కొచ్చాడు. ఉన్నంతలో ఓ కొత్త ఇల్లు కట్టుకున్నాడు. మూడు రోజుల క్రితం చుట్టాలను, కుటుంబ సభ్యులను ఆహ్వనించి గృహ ప్రవేశం చేశాడు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. రాత్రి చాలా సమయం బంధుమిత్రులందరితో ఆనందంగా గడిపిన రవి అర్థరాత్రి సోపాలో పడుకుని అలాగే కన్నుమూశాడు.
నెల రోజుల సెలవుపై డిసెంబరు 6న స్వదేశానికి వచ్చాడు రవి మృతితో.. శుభకార్యానికి వేసిన షామియానాలు, కుర్చీలు.. అతని చివరి మజిలీకి వినియోగించాల్సి రావడంతో బంధువులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రవి మరణంతో ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్న ఆయన తల్లిదండ్రులు.. భార్య ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. రవి అన్నదమ్ములిద్దరు కూడా గతంలో విద్యుత్ షాక్‌తో ఒకరు, గుండెపోటుతో మరొకరు ఇలాగే హఠాన్మరణం పొందడంతో ఆ కుటుంబాన్ని విధి పగబట్టిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు బిడ్డలను కళ్లముందే పోగొట్టుకున్న వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..