Love Marriage: మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. లింగన్నపేట గ్రామానికి చెందిన రాళ్లబండి రాజబాబు తన కొడుకుకి జైలు శిక్ష పడుతుందేమోననే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఊర్లోని చెరువులో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, ఈ ఆత్మహత్య వెనుక తీవ్రమైన విషాధ ప్రేమ గాధ ఉంది. ఒక్క పెళ్లి కారణంగా ముగ్గురు అసువులు బాసారు. అవును.. ఒక ప్రేమ పెళ్లి ముగ్గురు ప్రాణాలను బలిగొంది. మరి ప్రేమ కథా చిత్రం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాళ్లబండి బాబుకి కొడుకు రాళ్లబండి తిరుపతి. ఇతనికి కొడుకు సాయి. సాయి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఏమైందో ఏమో గానీ మూడు నెలల క్రితం సాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సాయి మృతితో అతని తండ్రి అయిన తిరుపతి కోడలిపై పగ పెంచుకున్నాడు. తన కొడుకు చావుకు ఆమె కారణమని నిత్యం రగిలిపోయాడు. ఆ కోపంతోనే నాలుగు రోజుల క్రితం కోడలి గొంతు కోసి హత్య చేశాడు తిరుపతి. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిరుపతి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
మరోవైపు, ఈ ఘటనపై మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తిరుపతి కుటుంబ సభ్యులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే తన కొడుక్కి హత్యానేరంతో శిక్ష తప్పదని, మృతురాలి కుటుంబ సభ్యులు దాడి చేస్తారని భయపడిపోయాడు తిరుపతి తండ్రి రాజబాబు. ఈ మేరకు సూసైడ్ నోట్ రాసిన రాజబాబు.. ఇవాళ గ్రామంలోని చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని చెరువు నుంచి రాజబాబు మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే, రాజబాబు మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. హత్యకు గురైన యువతి కుటుంబ సభ్యుల పాత్ర ఏమైనా ఉందా? అనే సందేహాలు వస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఒక ప్రేమ పెళ్లి ముగ్గురి ప్రాణాలను హరించింది. మరి ఈ కథం ఇంకెటు దారి తీస్తుందో.
Also read:
5 States Elections 2022: యూపీ సహా 5 రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా.. మీడియా ముందుకు ఈసీ..
Baby care: పిల్లలకు తరచూ జలుబు అవుతోంది.. ఉపశమనం కోసం 5 హోమ్ రెమిడీస్..