Bhatti Vikramarka: ఘనంగా భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.. ఫ్యామిలీ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబురాలు

రంగారెడ్డి జిల్లా డీసీపీ అధ్యక్షుడు చ‌ల్లా న‌ర‌సింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. భట్టి విక్రమార్క భార్య నందిని, ఇద్దరు కుమారులు సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య సహా అందరి సమక్షంలో భట్టి కేక్ కట్ చేశారు. పాదయాత్ర శిబిరం జై జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ అనే నినాదాలతో హోరెత్తింది.

Bhatti Vikramarka: ఘనంగా భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు.. ఫ్యామిలీ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబురాలు
Bhatti Birth Day Celebratiions

Updated on: Jun 15, 2023 | 8:13 PM

తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క తన జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ప్రస్తుతం ఆయన నల్గొండ జిల్లా జి. చెన్నారంలో పాదయాత్ర శిబిరంలో ఉన్నారు. అక్కడే తన కుటుంబం సభ్యులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల నడుమ ఈ జన్మ దిన వేడుకలను జరుపుకున్నారు. రంగారెడ్డి జిల్లా డీసీపీ అధ్యక్షుడు చ‌ల్లా న‌ర‌సింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. భట్టి విక్రమార్క భార్య నందిని,  ఇద్దరు కుమారులు సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య సహా అందరి సమక్షంలో భట్టి కేక్ కట్ చేశారు. పాదయాత్ర శిబిరం జై జై కాంగ్రెస్, జై సోనియా గాంధీ అనే నినాదాలతో హోరెత్తింది. భ‌ట్టి విక్రమార్క ఫొటోతో చేయించిన కేక్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మరోవైపు రాత్రి 12 దాటి 15వ తేదీలోకి అడుగు పెట్టగానే కార్యకర్తలు బాణా సంచా కాల్చి తమ సీట్స్ పంచుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మల్లు భట్టి విక్రమార్క వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు 1961, జూన్ 15న భట్టి విక్రమార్క జన్మించారు. విక్రమార్క హైదరాబాదులోని కళాశాల నుంచి డిగ్రీ పట్టాను,  హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన భట్టి విక్రమార్క 2009 లో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. అనంతరం ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ విప్‌గా వ్యవహరించారు. అంతేకాదు 2011 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..