Lok Sabha Elections: తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన కీలక నేతలు..

|

Apr 20, 2024 | 12:33 PM

తెలంగాణలో మూడో రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు మరికొంతమంది కీలక నేతలు నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. అయితే రెండోరోజు నామినేషన్లు పోటెత్తాయి. పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగా నామినేషన్లు వేశారు. ఇప్పటికే తెలంగాణలో నామినేషన్లు సంఖ్య సెంచరీ దాటింది. చాలా మంది ప్రముఖ నేతల నామినేషన్లు వేశారు.

Lok Sabha Elections: తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన కీలక నేతలు..
Telagnana Elections
Follow us on

తెలంగాణలో మూడో రోజు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ రోజు మరికొంతమంది కీలక నేతలు నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. అయితే రెండోరోజు నామినేషన్లు పోటెత్తాయి. పార్టీ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీగా నామినేషన్లు వేశారు. ఇప్పటికే తెలంగాణలో నామినేషన్లు సంఖ్య సెంచరీ దాటింది. చాలా మంది ప్రముఖ నేతల నామినేషన్లు వేశారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు రెండో రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. నిన్న ఒక్క రోజే 57 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా రెండు రోజుల్లో 117 నామినేషన్లు దాఖలు కాగా, 98 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక పసుపు రైతులతో కలిసివచ్చి ఆయన నామినేషన్ వేశారు. అర్వింద్ నామినేషన్ డిపాజిట్ డబ్బులు సైతం పసుపు రైతులే అందించారు. ఇక కరీంనగర్ పార్లమెంటు స్థానానికి బండిసంజయ్ తరపున‌ కుటుంబ ‌సభ్యులు నామినేషన్ వేశారు.

మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంశీచంద్‌ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల తర్వాత, హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా అసదుద్దీన్‌ ఒవైసీ నామినేషన్‌ వేశారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సికింద్రాబాద్ ఎంపీ సీటు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. పద్మారావు వెంట ఎమ్మెల్యే తలసాని, మాగంటి గోపీనాథ్ వెళ్లారు. ఇక మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బలరాం నాయక్‌ నామినేషన్‌ వేశారు. ఇప్పటివరకూ అత్యధికంగా సికింద్రాబాద్ పరిధిలో 10 నామినేషన్లు దాఖలు కాగా.. ఆ తర్వాత నిజామాబాద్‌లో 7, మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌లో 6, పెద్దపల్లి, భువనగిరి, మహబూబాబాద్‌లో 5 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 25 వరకు గడువు ఉండటంతో 17 సెగ్మెంట్లలో ఇంకా పెద్ద మొత్తంలో నామినేషన్లు వేసే అవకాశం ఉందని ఈసీ అంచనా వేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..