AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు.. సీన్‌ కట్‌చేస్తే.. ఇది పరిస్థితి!

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో భీకర గాలులు, భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకు ఎండల ప్రభావం కనిపించగా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి దట్టమైన మేఘాలు అలుముకోవడంతో పాటుగా బలమైన ఈదురు గాలులు విషాదాన్ని మిగిల్చాయి. భారీ వర్షాని గోడ కూలి ఇద్దరు వ్యక్తులు మరణించారు.

Watch: బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు.. సీన్‌ కట్‌చేస్తే.. ఇది పరిస్థితి!
Devarakadra Building Collapse
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jun 18, 2026 | 7:59 AM

Share

మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. జిల్లా వ్యాప్తంగా వర్షాలు, ఇదూరు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలోనే సాయంత్రం దేవరకద్ర నుంచి మహబూబ్ నగర్ వెళ్దామని బయలుదేరాలనుకున్న ఇద్దరు జీవితాలు అర్ధాంతరంగా ముగిసాయి. నిర్మాణంలో ఉన్న భవనం మొదటి అంతస్తు బాల్కనీ గోడ కారుపై కూలింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. అయితే మొదటి అంతస్తు ఎత్తు నుంచి పడిన ఇటుక పెల్లలు ధాటికి బోలెరో వాహనం నుజ్జ నుజ్జ అయ్యింది. స్థానికులు పోలీసులు అతికష్టం మీద వాహనంలో ఇరుక్కున్న ఇద్దరిని బయటకు తీశారు. వెంటనే అంబులెన్స్ లో మహబూబ్ నగర్ జిల్లా అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

మరో వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇక మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణ జిల్లా వుయ్యూరు కు చెందిన ఇంజనీర్ జగన్నాథ రెడ్డి(45) కాగా, మరోకరు ఝార్ఖండ్ కు చెందిన డ్రైవర్ సంతోష్ రామ్(42) డ్రైవర్ గా గుర్తించారు. వీరిద్దరు ఇటీవలె మంజూరైన మహబూబ్ నగర్ – గూడబల్లెరు జాతీయ రహదారి పనుల నిమిత్తం దేవరకద్రకు వచ్చారు.

ఇక ఘటనతో ఒక్కసారిగా దేవరకద్ర పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన ఇద్దరు ఇటీవలే దేవరకద్ర పట్టణానికి వచ్చారు. డ్రైవర్ సంతోష్ రామ్ వారం క్రితమే ఝార్ఖండ్ నుంచి వచ్చి విధుల్లో చేరాడు. ఓ పని నిమిత్తం ఇంజనీర్ జగన్నాథ రెడ్డితో పాటు మరో వ్యక్తి మహబూబ్ నగర్ వెళ్లాలని భావించారు. ఈ క్రమంలో డ్రైవర్ సంతోష్ రామ్ తో సదరు వ్యక్తి కోసం కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం పక్కన బోలెరో వాహనం నిలిపి అతని కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బలమైన గాలుల ధాటికి ఒక్కసారిగా మొదటి అంతస్తు బాల్కనీ వాహనంపై కూలడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఘటనతో ఒక్కసారిగా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఉలిక్కిపడ్డారు. మృత్యువు ఎప్పుడూ.. ఎలా, ఏ రూపేన వస్తుందో ఎవరు ఊహించలేరనడానికి ఇదే నిదర్శనంగా స్థానికులు చెబుతున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
UGC NET జూన్‌ 2026 పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్.. వీరందరికీ పింఛన్లు కట్..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
బయటకెళ్దామని కార్ తీశారు.. ఫ్రెండ్‌ కోసం ఓ ఇంటిపక్కన ఆగారు..
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
ధోనీ వర్సెస్ కోహ్లీ.. నెట్‌వర్త్‌లో అసలు కింగ్ ఎవరు..?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
'ధురంధర్' హీరో గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
కోతుల వీరంగం.. మహిళపై సిమెంట్ ఇటుకలు పడి దుర్మరణం
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
మదనపల్లిలో పురుష పుంగవుడి యవ్వారం.. మోహించిన మగాళ్లు ఎందరో..!
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. పంటల సాగుపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ ప్రకటన.. అకౌంట్లోకి ఎప్పుడంటే..?
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..
పూర్వీకుల ఆరోగ్య రహస్యం.. ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే శరీరంలో..