AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంటను చూసి.. వయసు మరచి..! పల్టీలు కొడుతూ అన్నదాత సంబురం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో ఇదే

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చింది.. అంతేకాకుండా భారీ దిగుబడి రావడంతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ వృద్ధ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చిన్నపిల్లాడిలా గంతులు వేస్తూ, కోత గడ్డిపై పల్టీలు కొడుతూ తన సంతోషాన్ని పంచుకున్నాడు. జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన రైతు బుడ్డ మల్లయ్య ఆనందకేళి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పంటను చూసి.. వయసు మరచి..! పల్టీలు కొడుతూ అన్నదాత సంబురం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో ఇదే
Mahabubnagar Farmer Video
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: May 20, 2026 | 8:46 PM

Share

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొస్తేనే రైతుకు పట్టలేనంత సంతోషం. అలాంటిది ఓ రైతుకు అధిక దిగుబడి వచ్చింది. ఇంకేముంటుంది ఆ అన్నదాత ఆనందం అంతా ఇంతా కాదు. ఆ సంతోషాన్ని చూడాలంటే రెండు కళ్లు చాలవు. మహబూబ్ నగర్ జిల్లాలో ఓ వృద్ధ రైతు ఆనందకేళి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన రైతు బుడ్డ మల్లయ్య ఎప్పటిలానే ఈ సారి తన వ్యవసాయ పొలంలో వరిధాన్యం పండించాడు. విత్తనాల నుంచి కంటిమీద కునుకు లేకుండా ఎండా, వాన, చలి, రేయి, పగలు తేడా లేకుండా తన రక్తాన్ని శ్రమగా పెట్టాడు. గతేడాది కంటే పంట మంచిగా పెరిగింది.. ఇక చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు కొంత భయాందోళనకు గురిచేసినా నష్టం చేయలేదు. భగవంతుడిపై విశ్వాసంతో కొతకు సిద్దమయ్యాడు హార్వేష్టర్ యంత్రాన్ని మాట్లాడుకొని పంటకోతను ప్రారంభించాడు. ఇక కోత చివరకు చేరుకునే సరికి ధాన్యం సిరులు కురిసాయి.

గతేడాది కంటే దిగుబడి భారీగా పెరగడంతో అన్నదాత బుడ్డ మల్లయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వయసును మరిచి చిన్న పిల్లాడిలా గంతులేశాడు. తన సంబురాన్ని నేల తల్లితో పంచుకునేలా కోత గడ్డిపై పల్డీలు కొట్టాడు. ఆ వృద్ధ రైతు పట్టలేని సంతోషాన్ని చూడాలంటే రెండు కళ్లు చాలవు అన్నట్లుగా ఉంది. ఓ పక్క వరికోత యంత్రం తన పని తాను చేస్తుండగానే బుడ్డ మల్లయ్య గంతులు తెగ ముచ్చట వేశాయి.

వీడియో చూడండి..

ఎప్పుడు అన్నదాతల కష్టాలు, ఆర్తనాదాలే వినిపించే కాలంలో అసలు అన్నదాత పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కితే ఎలా ఉంటుందో ఈ ఘటన సాక్షాత్కారించింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పంట చేతికొచ్చిన వేళ చిన్నపిల్లాడిలా రైతు మల్లయ్య గంతులు, పల్టీలు కొడుతుండడం, భూతల్లిపై ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇక మరికొంత మంది అయితే ఈ వయసులోనూ ఏమిటా ఆ ఫిట్ నెస్ అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us