AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: మహా ఘటికురాలు.. దొంగలకు చుక్కలు చూపించిన వృద్ధురాలు.. చివరకు ఏం జరిగిందంటే..

మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న వృద్దురాలి మేడలో బంగారు గొలుసును కొట్టేసేందుకు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. దొంగలతో ప్రతిఘటించిన వృద్దురాలిని కొట్టి బావిలో పడేశారు. ప్రాణాలు వదిలినా ఆ వృద్ధురాలు తన చేతిలోని బంగారాన్ని మాత్రం వదలలేదు. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Telangana News: మహా ఘటికురాలు.. దొంగలకు చుక్కలు చూపించిన వృద్ధురాలు.. చివరకు ఏం జరిగిందంటే..
Telangana News
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Sep 15, 2025 | 9:13 PM

Share

ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో జరిగింది. రాధమ్మ అనే వృద్దురాలు ఒంటరిగా జీవనం కొనసాగిస్తోంది. రాధమ్మకు ముగ్గురు కుమారులు వారిలో ఇద్దరు మహబూబాబాద్ లో నివశిస్తున్నారు.. మరొక కుమారుడు సూరత్ లో స్థిరపడ్డారు. భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. దీంతో వృద్ధురాలు ఒంటరిగా జీవనం సాగిస్తోంది. అయితే ఆమె మెడలో ఉన్న బంగారంపై కన్నేసిన కొందరు దుండగులు కాజేసేందుకు ప్లాన్ చేశారు. రాత్రి సమయంలో రాధమ్మ ఒంటరిగా ఉంటుందని గమనించిన దుండగులు చోరికి వచ్చారు.

దొంగలను గమనించిన రాధమ్మ వారితో చాలా సేపు ప్రతిఘటించింది. తీవ్ర గాయాలతో ప్రాణం పోతున్న తన మేడలోని గొలుసును మాత్రం దుండగుల చేతికి చిక్కనియ్యలేదు.. వాళ్లను ముప్పతిప్పలు పెట్టింది. ఇక ఇలా అయితే కుదరదని భావించిన దుండగులు రాధమ్మపై తీవ్రంగా దాడి చేసి ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత ఆమె కాళ్ళ పట్టిలు, చేతి వెండి కడియం, 3 తులాల బంగారు ఆభరణాలు కాజేశారు. ఆ తర్వాత రాధమ్మ మృతదేహాన్ని సమీపంలోని బావిలో పడేసి అక్కడి నుండి గుట్టు చప్పుడు కాకుండా పారిపోయారు.

అయితే ఉదయం రక్తపు మరకల ఆధారంగా చేద బావిలో రాధమ్మ మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాధమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే దుండగులతో తీవ్రంగా పోరాడిన రాధమ్మ తన గొలుసును మాత్రం వదలలేదు. మృతదేహం వెలికి తీసినప్పుడు ఆమెచేతిలో గొలుసు అలానే ఉంది. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్..
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..