AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Govt Jobs 2026: ప్రభుత్వ ఉద్యోగం కావాలా? ఏపీలో 529 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్ష లేదు

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది..

AP Govt Jobs 2026: ప్రభుత్వ ఉద్యోగం కావాలా? ఏపీలో 529 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్ష లేదు
APMSRB Recruitment
Srilakshmi C
|

Updated on: Jun 14, 2026 | 7:21 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆరోగ్య రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 30, 2026వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివవరాలు..

  • స్టాఫ్ నర్స్ పోస్టుల సంఖ్య: 419
  • ఫార్మసిస్ట్ పోస్టుల సంఖ్య: 24
  • మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ (NPHCE) పోస్టుల సంఖ్య: 86

స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు B.Sc Nursing లేదా General Nursing and Midwifery (GNM) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే APNMC రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకుని ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు D.Pharmacy లేదా B.Pharmacy ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఏపీ ప్రభుత్వం గుర్తించిన Pharmacy Vocational Course పూర్తి చేసి ఉండాలి. AP Pharmacy Council రిజిస్ట్రేషన్ తప్పనిసరి. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు ఇంటర్‌ అర్హతతో పాటు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 1½ సంవత్సరాల Multi Rehabilitation Worker Certificate Course పూర్తి చేసి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ ST/ EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 30, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.1,200, SC/ ST/ EWS/ దివ్యాంగ అభ్యర్థులు రూ.900 తప్పనిసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల ఎంపిక విద్యార్హతల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి స్టాఫ్‌ నర్స్ పోస్టులకు నెలకు రూ.27,675, ఫార్మసిస్ట్ పోస్టులకు నెలకు రూ.23,393, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు నెలకు రూ.23,494 చొప్పున జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్.. APలో 529 ఉద్యోగాలు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
ఇదంతా పరమశివుని ఆశీర్వాదమే.. గుడ్‌న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
IIT Bombay CSE కోసం ఊహించని పోటీ.. టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే అప్లై చేసుకోండి
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..