Telangana: ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రూటే సపరేటు.. ఏం చేసిన ప్రత్యేకమే.. ఇంతకీ ఆయనెవరంటే..

Telangana: నిత్యం ఏదో ఓ కారణంతో, అప్పుడప్పుడు వివాదాస్పద వాఖ్యలతో తరుచూ వార్తలలో నిలుస్తుంటాడు ఓ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే రూటే సపరేటు. సమస్యలున్న చోట, పరిష్కారం కోసం కార్మికుడిలాగా..

Telangana: ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రూటే సపరేటు.. ఏం చేసిన ప్రత్యేకమే.. ఇంతకీ ఆయనెవరంటే..
Mla

Telangana: నిత్యం ఏదో ఓ కారణంతో, అప్పుడప్పుడు వివాదాస్పద వాఖ్యలతో తరుచూ వార్తలలో నిలుస్తుంటాడు ఓ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే రూటే సపరేటు. సమస్యలున్న చోట, పరిష్కారం కోసం కార్మికుడిలాగా, డ్రైవర్ గా, ఇంజనీర్‌గా అవతారమెత్తాడు. ఓ చోటా విద్యుత్ వైర్ల సమస్య తలిత్తితే, ఆయన చేసిన పనేంటో తెలుసా?..

గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండా‌లో గ్యాస్ సిలిండర్ పేలి రైతు చనిపోతే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరామర్శించారు. పేలిన ప్రదేశాన్ని, చనిపోయిన రైతును చూసి చలించిపోయాడు. అంతేకాదు తక్షణ ఆర్థిక సహాయం చేసారు. వారం లోగా మరో 15 లక్షల రూపాయలు సాయం అందించేలా చర్యలకు ఉపక్రమించాలనీ అధికారులను అక్కడే ఆదేశించారు. అనంతరం గుండెంగ గ్రామంలో వాడవాడలు కలియతిరిగారు. అనారోగ్యంగా ఉన్న పలువురి కార్యకర్తలను ఇంటికి వెళ్ళి మరీ పరామర్శించారు.

అయితే, దారిలో ఓ ముసలవ్వ ను ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించారు. అవ్వ బాగున్నావా? ఆసరా పించన్ వస్తుందా? అని అడిగి తెలుసుకున్నారు. ఆసరా పించన్ అనగానే అవ్వ ముఖంలో సంతోషాన్ని గమనించారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. తన వంతుగా కొంత నగదును అవ్వ చేతిలో పెట్టారు. దానికి స్పందించిన ఆ ముసలవ్వ.. ‘‘సల్లంగుండు బిడ్డా, సీఎం సారు రెండు వేలు ఇస్తాండు. నేను మంచిగున్నా! నువ్వు గూడ పైలంగా ఉండు బిడ్డా’’ అని ఎమ్మెల్యేను ఆశీర్వదించింది.

అనంతరం అయోధ్యపురం నుండీ పొనుగోడుకు వెళ్ళే దారిలో విద్యుత్ వైర్లు సరిగా లేవని గమనించిన ఎమ్మెల్యే.. అధికారులను తక్షణమే అక్కడికి రప్పించారు. అక్కడ ఉండి విద్యుత్ స్తంభాలను స్వయంగా తన చేతితో భూమిలో పాతారు. చెట్ల కొమ్మలను తానే తీసిపారేసారు. స్తంభాలు నాటే ట్రాక్టర్ ను రెండు కిలోమీటర్లు స్వయంగా నడిపారు. దాంతో స్తంభాలను పాతారు. వైర్లు సరిచేసే వరకు అక్కడే ఉండి పని పూర్తయ్యాక వెళ్ళిపోయారు. ఎలక్ట్రిసిటీ డివిజనల్ అధికారి సామ్యానాయక్ చేత కూడ ఎమ్మెల్యే పనిచేయించడం కొసమెరుపు. పది సంవత్సరాలుగా పరిష్కారం కానీ సమస్యను ఎమ్మెల్యే దగ్గరుండి చిటికెలో చేశారు.

ఆపదొస్తే నేనున్నా అనే నాయకులు చాలా అరుదు. ఈ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకవుతుండటం, అభివృద్ది పనులను చేసే విధానం చూసిన వారు ఈయన రూటే సపరేటు అంటూ, తమ సెల్ ఫోన్లలో ఆయన చేసిన ఫీట్లను బంధిస్తూ మురిసిపోయారు.

Also read:

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే!

PM Modi US Tour: కరోనా తర్వాత తొలి పర్యటన.. అగ్రరాజ్యానికి ఇవాళ ప్రధాని మోదీ పయనం

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో అరాచకాలు.. లోబో బండారం బయటపెట్టిన పింకీ..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu