టి-కాంగ్రెస్‎లో కులం కుంపటి.. రగిలి పోతున్న ఆ నేతలు ఎవరు..

| Edited By: Srikar T

Apr 05, 2024 | 3:46 PM

లోక్ స‌భ అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌తో తెలంగాణ కాంగ్రెస్‎లో అసంతృప్తులు పెరుగుతున్నారు. జ‌న‌ర‌ల్ స్థానాల్లోని నేత‌లు త‌మ అసంతృప్తిని బ‌య‌ట పెట్ట‌న‌ప్ప‌టికీ.. ఎస్సీ రిజ‌ర్వ్ స్థానాల్లో మాత్రం ర‌గిలిపొతున్నారు. తెలంగాణ‌లో ఎస్సీ రిజ‌ర్వ్ స్థానాలు మూడు ఉన్నాయి. అందులో క‌నీసం రెండు స్థానాలు త‌మకు కేటాయించాల‌ని మాదిగ సామాజికవ‌ర్గం డిమాండ్ చేసింది.

టి-కాంగ్రెస్‎లో కులం కుంపటి.. రగిలి పోతున్న ఆ నేతలు ఎవరు..
Telangana Congress
Follow us on

లోక్ స‌భ అభ్య‌ర్ధుల ప్ర‌క‌ట‌న‌తో తెలంగాణ కాంగ్రెస్‎లో అసంతృప్తులు పెరుగుతున్నారు. జ‌న‌ర‌ల్ స్థానాల్లోని నేత‌లు త‌మ అసంతృప్తిని బ‌య‌ట పెట్ట‌న‌ప్ప‌టికీ.. ఎస్సీ రిజ‌ర్వ్ స్థానాల్లో మాత్రం ర‌గిలిపొతున్నారు. తెలంగాణ‌లో ఎస్సీ రిజ‌ర్వ్ స్థానాలు మూడు ఉన్నాయి. అందులో క‌నీసం రెండు స్థానాలు త‌మకు కేటాయించాల‌ని మాదిగ సామాజికవ‌ర్గం డిమాండ్ చేసింది. తెలంగాణ‌లో సుమారు 80 ల‌క్ష‌ల మంది మాదిగ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లున్నారు. మాల సామాజిక వ‌ర్గ ఓట్లు 17 ల‌క్షల వ‌ర‌కు ఉంటాయి. అందుకే పార్టీలు ఈ సామాజిక వర్గానికి మెజారిటి సీట్లు కేటాయిస్తాయి. ఉన్న మూడు సీట్లలో రెండు మాల సామాజిక వ‌ర్గానికే కేటాయించార‌నే విమ‌ర్శ‌లున్నాయి. దీనికి తోడు వ‌రంగ‌ల్ సీటును మాదిగ సామాజికవ‌ర్గంలోని ఉప కులానికి ఇచ్చారని మాదిగ సామాజికవర్గ నేతలు రగిలిపోతున్నారు. దీంతో మాదిగ సామాజికవ‌ర్గం కాంగ్రెస్‎ను కార్నర్ చేస్తుంది. ఎంఆర్‎పీఎస్ వ్య‌వ‌స్ధాప‌కులు మంద‌క్రిష్ణ మాదిగ అయితే ఏకంగా 10 రోజుల పాటు ధర్నాల‌కు, దీక్ష‌ల‌కు పిలుపునిచ్చారు.

దీంతో కాంగ్రెస్‎లోని మాదిగ సామాజికవ‌ర్గ నేత‌లు అల‌ర్ట్ అయ్యారు. త‌మ వ‌ర్గానికి టికెట్ల కేటాయింపులో అన్యాయం జ‌రిగింద‌ని అంగీక‌రిస్తున్నారు. అధిష్టానం అభ్య‌ర్ధుల‌ను మార్చాల‌ని కోరుతున్నారు. మూడు సీట్లలో, ఒక్క సీటు మాదిగ సామాజికవ‌ర్గానికి ఇచ్చామని చెప్తున్నా.. అది వర్కవుట్ కావడం లేదు. అందుకే ఈ వర్గానికి ఒక ఎంపీ టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ డిమాండ్ చేస్తున్నారు. కొంద‌రు నేత‌లైతే ఏకంగా ఢిల్లీలో నిర‌స‌న‌ల‌కు దిగారు. నేడో రేపో అధిష్టాన పెద్ద‌ల‌ను క‌లిసి త‌మ అసంతృప్తి వ్య‌క్తం చేసేందుకు సిద్ద‌మ‌య్యారు.

అదే స‌మ‌యంలో బీజేపీకి ప్ర‌చారం చేస్తున్న మంద క్రిష్ణ ట్రాప్‎లో ప‌డొద్ద‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఙప్తి చేస్తున్నారు. మాదిగ సామాజికవ‌ర్గానికి కాంగ్రెస్ న్యాయం చేసింద‌ని. వ‌ర్గీక‌ర‌ణ కాంగ్రెస్‎తోనే సాధ్య‌మ‌ని చెబుతున్నారు. ద‌ళిత వ‌ర్గానికి చెందిన మ‌ల్లికార్జున ఖార్గే స్వ‌యంగా ఎఐసీసీ అధ్య‌క్షుడిగా ఉన్నార‌ని గుర్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..