SRH vs CSK: ఉప్పల్ మ్యాచ్‌కు ముందు నాటకీయ పరిణామాలు.. హెచ్‌సీఏ వెర్సస్ విద్యుత్ శాఖ.. అసలేం జరిగిందంటే.?

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఏప్రిల్‌ 5న పోరు హోరాహోరీగా సాగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నువ్వా.. నేనా అనేది తేల్చుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్‌రైజర్స్‌ బ్యాటర్ల విధ్వంసం తిలకించేందుకు అభిమానులు భారీగా తరలి రానున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ జరగడానికి కొన్ని

SRH vs CSK: ఉప్పల్ మ్యాచ్‌కు ముందు నాటకీయ పరిణామాలు.. హెచ్‌సీఏ వెర్సస్ విద్యుత్ శాఖ.. అసలేం జరిగిందంటే.?
Uppal Stadium
Follow us

|

Updated on: Apr 05, 2024 | 1:26 PM

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఏప్రిల్‌ 5న పోరు హోరాహోరీగా సాగనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నువ్వా.. నేనా అనేది తేల్చుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్‌రైజర్స్‌ బ్యాటర్ల విధ్వంసం తిలకించేందుకు అభిమానులు భారీగా తరలి రానున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ జరగడానికి కొన్ని గంటల ముందు కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియం అంధకారంలో చిక్కుకుంది.. బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్‌ అధికారులు పవర్ కట్ చేశారు. స్టేడియం నిర్వాహకులు బిల్లులు చెల్లించకుండా.. రూ.1.67 కోట్లు విద్యుత్‌ వాడుకున్నారని విద్యుత్‌ శాఖ తెలిపింది. పెండింగ్‌ బిల్లులు క్లియర్‌ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా హెచ్‌సీఏ పట్టించుకోలేదని, నోటీసులకు స్పందించకపోవడంతోనే విద్యుత్‌ సరఫరాను కట్‌ చేసినట్లు చెప్పారు. ఇక స్టేడియం నిర్వాహకుల వాదన మరోలా ఉంది. విద్యుత్‌ శాఖ అధికారులు క్రికెట్‌ మ్యాచ్‌ను చూసేందుకు అడిగిన పాసులు ఇవ్వక పోవడంతో పవర్ కట్ చేరని HCA చెబుతోంది. ఏదీ ఏమైనా హెచ్‌సీఏ అధికారులు చర్చలు జరపడంతో ఎట్టకేలకు గురువారం రాత్రి 9 గంటలకు అధికారులు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు..

బ్లాక్‌ టికెట్ల దందా

ఇదిలా ఉండగా, ఐపీఎల్‌ను క్యాష్‌ చేసుకుంటూ హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఎదుటే బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. ఎలాగైనా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని ఉవ్విళ్లూరుతోన్న క్రికెట్ అభిమానుల ఆశను ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారు. 35 వేల సామర్థ్యమున్న ఉప్పల్‌ స్టేడియం టికెట్లను పెద్ద సంఖ్యలో బ్లాక్‌ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. టికెట్లతో పాటు కాంప్లిమెంటరీ పాసులను కూడా బ్లాక్‌లో అమ్ముతున్నారు. అయితే అక్రమంగా టికెట్ల పంపకాలకు HCA‌ తెరలేపినట్టు బహిరంగ విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏకంగా స్టేడియం ఎదుటే బ్లాక్‌ టికెట్‌ దందా మొదలైంది. టికెట్లతో పాటు కాంప్లిమెంటరీ పాసులను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాను గతంలో పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎల్ టికెట్ల పక్కదారి పడుతున్నాయని ఆరోపిస్తున్నారు అభిమానులు.1500 టికెట్‌ను రూ.5వేలుగా, రూ. 4వేల టికెట్‌ను రూ. 9 వేలుగా, రూ. 6 వేల టికెట్ రూ. 12 వేలు చొప్పున బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఈ పరిణామాల మధ్య అసలు ఉప్పల్ స్టేడియంలో ఏం జరుగుతోందనే అనుమానం కలిగింది. అయితే ఒకవైపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. పోలీసులు, ప్రభుత్వం కూడా ఎన్నికల పై దృష్టి పెట్టింది. ఇదే అదునుగా HCA పాలకవర్గం రెచ్చిపోయింది. స్టేడియం కెపాసిటీ ఎంత..? ఎన్ని టికెట్లు అమ్మకానికి పెడతారు..? ఎన్ని టికెట్లు కాంప్లిమెంటరీ గా ఇస్తారు..? Paytm పారదర్శకంగా టికెట్లు అమ్ముతుందా లేదా..? ఇలాంటివి పట్టించుకునే నాథుడే లేడు. మునుపెన్నడూ లేని రీతిలో బ్లాక్ టికెట్ల దందా ఈసారి జరిగింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
డయాబెటిక్ పేషెంట్లకు అలర్ట్.. కొబ్బరి నీళ్లు తాగొచ్చా..? లేదా..?
డయాబెటిక్ పేషెంట్లకు అలర్ట్.. కొబ్బరి నీళ్లు తాగొచ్చా..? లేదా..?
'ఓవర్ ఛార్జింగ్' వల్ల ఫోన్ పేలిపోతుందా? ఈ తప్పులు చేయకండి..!
'ఓవర్ ఛార్జింగ్' వల్ల ఫోన్ పేలిపోతుందా? ఈ తప్పులు చేయకండి..!
రైలు జనరల్‌ టికెట్లు ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చు. అదెలా?
రైలు జనరల్‌ టికెట్లు ఇంటి నుంచే బుక్‌ చేసుకోవచ్చు. అదెలా?
చార్‌ధామ్ యాత్ర భక్తులకు అలెర్ట్ మే 31వరకు రిజిస్ట్రేషన్ నిలుపుదల
చార్‌ధామ్ యాత్ర భక్తులకు అలెర్ట్ మే 31వరకు రిజిస్ట్రేషన్ నిలుపుదల
వాటే బ్యూటీ.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు..
వాటే బ్యూటీ.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు..
మీ గుండెకి ఇది బ్రహ్మాస్త్రం.. రోజూ ఇలా చేశారంటే.!
మీ గుండెకి ఇది బ్రహ్మాస్త్రం.. రోజూ ఇలా చేశారంటే.!
ఇలా వెళితే నేరుగా యమపురికే.. ! కిక్కిరిసిన రైలులో ఇలాంటి సాహసం
ఇలా వెళితే నేరుగా యమపురికే.. ! కిక్కిరిసిన రైలులో ఇలాంటి సాహసం
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై 3 నుంచి 4 రోజుల్లోనే..
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై 3 నుంచి 4 రోజుల్లోనే..
దేశంలో 4 బెస్ట్ ప్రభుత్వ పథకాలు..ఏ పథకం ఎక్కువ రాబడి ఇస్తుందంటే..
దేశంలో 4 బెస్ట్ ప్రభుత్వ పథకాలు..ఏ పథకం ఎక్కువ రాబడి ఇస్తుందంటే..
వారణాసి వెళ్లాలనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలను చూడడం మర్చిపోవద్దు
వారణాసి వెళ్లాలనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలను చూడడం మర్చిపోవద్దు