Telangana: ఈ జిల్లాల్లో జోరుగా మద్యం అమ్మకాలు.. పండగ మూడు రోజులు ఏకంగా ఇన్ని కోట్లా.?
శుభకార్యమైన, పండుగలైన మద్యం ఏరులై పారాల్సిందే. మామూలుగా పండుగ అయితేనే మందుబాబులు వైన్స్ ముందు క్యూ కడతారు. అలాంటిది ఏకంగా వరుసగా నాలుగు రోజులు సెలవులు కావడంతో ఇంకేముంది మద్యం ప్రియులకు జాతరే. ఈసారి సంక్రాతి వరుస సెలవులు మందుబాబులకు కలిసివచ్చింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సంక్రాంతి సందర్భంగా మద్యం ప్రియులు ఫుల్లుగా తాగేశారు. కోట్ల రూపాయల్లో మద్యం అమ్మకాలు జరగడంతో ప్రభుత్వానికి భారీ ఆదాయమే వచ్చింది. సంక్రాంతి సందర్భంగా కేవలం మూడు రోజుల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రూ.50కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. దీంతో మద్యం అమ్మకాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ జిల్లా. పండుగకు నాలుగు రోజుల ముందే మద్యం వ్యాపారులు తిమ్మాజీపేట, కొత్తకోట డిపోల నుంచి పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేశారు. ఈ నెల 12నుంచి కేవలం మూడురోజుల్లో రూ.51.86కోట్ల విలువ చేసే మద్యం నిల్వలను దుకాణాలకు తరలించారు. ఇందులో 55,660 ఐఎంఎల్ కాటన్లు, 72,669 కాటన్ల బీర్లు డిపోల నుంచి ఖరీదు చేశారు. వీటితో పాటు అప్పటికే మద్యం దుకాణాల్లో సుమారు రూ.10కోట్ల మేర స్టాక్ ఉన్నట్లు అంచనా. మొత్తంగా ఈ సంక్రాంతికి దాదాపు రూ.60కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
జడ్చర్లలో అధికం.. ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు మద్యం ప్రియులతో కళకళలాడాయి. ఓవరాల్గా మద్యం అమ్మకాల్లో మహబూబ్నగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ప్రాంతాల వారీగా చూస్తే జడ్చర్ల, మహబూబ్నగర్, గద్వాల, కోత్తకోటలో మందుబాబులు తమ సత్తా చాటారు. మొత్తంగా మహబూబ్నగర్, నారాయణపేట రెండు జిల్లాలో 90, నాగర్ కర్నూల్ జిల్లాలో 67, వనపర్తి జిల్లాలో 37, గద్వాల్ లో 36 మద్యం దుకాణాల్లో అమ్మకాలు జోరుగా సాగాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..