మాజీ మంత్రి మల్లారెడ్డి నుంచి మా భూములు ఇప్పించండి.. ప్రజావాణిలో మొరపెట్టుకున్న 600 మంది బాధితులు
తెలంగాణలో ప్రజాప్రతి నిధుల భూభాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు అధికార, అంగ బలాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములు లాక్కున్నారంటూ బాధితులు గోడు వెళ్ళబోసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని ప్రజావాణిలో తమ సమస్య చెప్పుకునేందుకు వచ్చారు.

తెలంగాణలో ప్రజాప్రతి నిధుల భూభాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు అధికార, అంగ బలాన్ని అడ్డుపెట్టుకుని తమ భూములు లాక్కున్నారంటూ బాధితులు గోడు వెళ్ళబోసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని ప్రజావాణిలో తమ సమస్య చెప్పుకునేందుకు వచ్చారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లికి చెందిన దాదాపు 600 మంది బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మల్లారెడ్డిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయంలో మొరపెట్టుకున్నారు.
శ్రీ మల్లికార్జున నగర్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సొసైటీలో తమ భూములను మల్లాఃరెడ్డి కబ్జా చేశారంటూ ఫ్లెక్సీలతో ప్రజాభవన్ ముందు ఆదోళనకు దిగారు. మల్లారెడ్డిపై చర్యలు తీసు కుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫేక్ డాక్యుమెంట్స్‌తో మల్లారెడ్డి తమ భూములు కబ్జా చేశారని ఆరోపించారు. ఈ మేరకు తన భూమిలోని 360 ప్లాట్లలో 110 ప్లాట్లు మల్లారెడ్డి కబ్జా చేశారని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే అధికారం అడ్డంపెట్టకుని బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. గతంలోనూ దీనిపై న్యాయ పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్, రెవిన్యూ అధికారులు తమకు న్యాయం చేయాలని వినతులు ఇస్తున్నారు.
ఇక ప్రజావాణి కార్యక్రమానికి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బాధితులు సైతం ఆందోళనకు దిగారు. ప్రేమ్ సాగర్ రావు తమ నుంచి తమ ప్లాట్లను కాపాడాలంటూ కాప్రా కృష్ణా నగర్ ప్లాట్ ఓనర్స్ నిరసన చేపట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక మొదలు పెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వినతి పత్రాలు వస్తుండగా ఇందులో భూవివాదాలే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…