AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kukatpally Election Result 2023: కూకట్‌పల్లిలో మరోసారి గెలుపొందిన మాదవరం కృష్టారావు

Kukatpally Assembly Election Result 2023 Live Counting Updates: కూకట్‌పల్లి నియోజకవర్గం.. హైదారాబాద్‌లో అందరి అటెన్షన్ ఉండే సీట్. ఏపీకి చెందిన సెటిలర్స్ ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. 2018 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీచేసిన మాదవరం కృష్ణారావు, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె, టీడీపీ క్యాండిడేట్ నందమూరి సుహాసినిపై గెలుపొందారు.  

Kukatpally Election Result 2023: కూకట్‌పల్లిలో మరోసారి గెలుపొందిన మాదవరం కృష్టారావు
Kukatpally
Ram Naramaneni
|

Updated on: Dec 03, 2023 | 6:43 PM

Share

కూకట్‌పల్లిలో మరోసారి  విజయం సాధించారు బీఆర్‌ఎస్ అభ్యర్థి మాదవరం కృష్టారావు. ఈసారి ఆయన మెజార్టీ మరింత పెరిగింది. సెటిలర్లు ఎక్కువమంది బీఆర్‌ఎస్‌కే ఓటు వేసినట్లున్నారు. ఏకంగా 70387 ఓట్లు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిపై బండి రమేష్‌పై విజయం సాధించారు మాదవరం కృష్ణారావు. బీజేపీ మద్దతుతో జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగిన ప్రేమ్ కుమార్‌కు 39830 ఓట్లు పోలయ్యాయి.

కూకట్‌పల్లి నియోజకవర్గం (Kukatpally Assembly Election).. హైదారాబాద్‌లో అందరి అటెన్షన్ ఉండే సీట్. ఏపీకి చెందిన సెటిలర్స్ ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. 2018 ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా పోటీచేసిన మాదవరం కృష్ణారావు, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె, టీడీపీ క్యాండిడేట్ నందమూరి సుహాసినిపై గెలుపొందారు.  కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి కలిసి మహా కూటమిగా పోటీ చేసిన నేపథ్యంలో టీడీపీ ఈ సీటు తీసుకుంది. అప్పుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా రిజల్ట్ మాత్రం నెగెటివ్‌గానే వచ్చింది. చంద్రబాబు, కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీలు కలిసి కూకట్‌పల్లితో ప్రచారం చేసినా.. టీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవరం కృష్టారావు  41049 భారీ మెజార్టీతో గెలుపొందారు.  కృష్ణారావుకు 111612 ఓట్స్ రాగా, సుహాసినికి 70563 ఓట్లు పడ్డాయి.  BSP అభ్యర్థిగా పోటీచేసిన హరిశ్చంద్రారెడ్డికి 12 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్