పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో క్షుద్రపూజల కలకలం.. భయపెడుతున్న వీడియో

|

Feb 27, 2023 | 3:05 PM

అంతరిక్షంలోకి దూసుకెళుతున్న నేటి రోజుల్లో కూడా ఇంకా మూఢ నమ్మకాల ఊబిలో పడి దొంగబాబాల బారిన పడి జనం మోసపోతున్నారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో క్షుద్రపూజల కలకలం.. భయపెడుతున్న వీడియో
Kshudra Pujalu
Follow us on

ప్ర‌స్తుతం టెక్నాల‌జీ ఎంత డెవ‌ల‌ప్ అవుతున్నా కొంత‌మందిలో పేరుకుపోయిన మూఢవిశ్వాసాల్లో మాత్రం మార్పు రావ‌డంలేదు. ఇంకా క్షుద్ర‌పూజలు, జంతు బ‌లులు చేస్తూ మూడ‌న‌మ్మ‌కాలతోనే జీవిస్తున్నారు. ఊరి బయట అర్ధరాత్రుళ్లు క్షుద్రపూజలు, చేతబడి వంటి చిత్ర విచిత్ర పూజలు చేస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఊరి బయట కనిపించే విచిత్ర పూజలతో రైతులు పంట పొలాల్లోకి వెళ్లాలంటే కూడా భయాందోళన చెందుతున్నారు. ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లే వాళ్లు కూడా భయంతో అటు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో క్షుద్రపూజల కలకలంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన క్షుద్ర పూజలతో జనం వణికిపోతున్నారు. రాత్రయితే చాలు మంత్రగాళ్లు క్షుద్రపూజలు, చేతబడి చేస్తున్నారు. మూడు, నాలుగు రోడ్ల కూడలి వద్ద విస్తరాకులో అన్నం ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి, నిమ్మకాయలు పెట్టి, ప్రాణం ఉన్న ఒక కోడిని కూడా అక్కడే వదిలి పెట్టి, అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. రాత్రయితే చాలు బయటకు వెళ్లాలంటే వాటిని చూసి జనం భయాందోళనకు గురవుతున్నారు.

ఎవరైనా అనారోగ్యం పాలైతే వారిని నాలుగు రోడ్ల కూడలి వద్ద కూర్చుండబెట్టి మంత్రగాళ్లు వారిపై క్షుద్రపూజలు చేసి, ఆ ప్రాంతంలో అన్నం ముద్దలకు పసుపు పట్టించి, కొబ్బరికాయ, నిమ్మకాయలు, ప్రాణం ఉన్న కోడితో భయానక పూజలు చేస్తున్నారు. ఆరోగ్యం బాగాలేని వ్యక్తులపై నుండి కోడిని తిప్పి అక్కడే వదిలేసి వెళుతున్నట్టు తెలిసింది. ఇలా చేయడం వల్ల వారిపై ఉన్న పీడ శక్తులు తొలిగిపోతాయనే నమ్మకంతో జనాలు ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. కానీ, ఇదంతా చూసిన జనాలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ఇవి కూడా చదవండి

అంతరిక్షంలోకి దూసుకెళుతున్న నేటి రోజుల్లో కూడా ఇంకా మూఢ నమ్మకాల ఊబిలో పడి దొంగబాబాల బారిన పడి జనం మోసపోతున్నారు. స్వచ్ఛంద సంస్థలు గానీ, పోలీసులు గానీ మూఢనమ్మకాల బారిన పడి మోసపోతున్న వారికి అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..