Komatireddy Venkat Reddy: భావోద్వేగంలో నోరు జారాను.. చెరుకు సుధాకర్‌పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి..

|

Mar 06, 2023 | 1:49 PM

నల్లగొండ రాజకీయాలు.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేశాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తోంది. వర్గవిబేధాలతో రగిలిపోతున్న కాంగ్రెస్ పార్టీలో మరో సరికొత్త ఎపిసోడ్ తెరపైకి రావడం ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది.

Komatireddy Venkat Reddy: భావోద్వేగంలో నోరు జారాను.. చెరుకు సుధాకర్‌పై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి..
Komatireddy Venkat Reddy, Cheruku Sudhakar
Follow us on

నల్లగొండ రాజకీయాలు.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేశాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తోంది. వర్గవిబేధాలతో రగిలిపోతున్న కాంగ్రెస్ పార్టీలో మరో సరికొత్త ఎపిసోడ్ తెరపైకి రావడం ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. చెరుకు సుధాకర్ చంపేందుకు తన మనుషులు తిరుగుతున్నారంటూ ఏకంగా.. ఆయన కొడుకు సుహాస్ తో ఫోన్ లో మాట్లాడటం మరింత ఆజ్యం పోసినట్లయయింది. ఈ క్రమంలో చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్‌తో ఫోన్‌ కాల్‌ లో మాట్లాడిన వ్యవహారంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సుహాస్‌తో ఫోన్‌కాల్‌లో భావోద్వేగంలో నోరు జారిన మాట వాస్తవమేనంటూ పేర్కొన్నారు. పార్టీలో చేరిన దగ్గర నుంచి చెరుకు సుధాకర్‌ తనను తిడుతున్నారని.. ఎవరో మెప్పు కోసం నన్ను తిడితే ఎలా అంటూ పేర్కొన్నారు. వీడియోలకు నీచంగా టైటిల్స్‌ పెడుతున్నారు.. ఎందుకు అలా పెడుతున్నారని మాత్రమే ప్రశ్నించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాను మాట్లాడిన కొన్ని విషయాలు కట్‌ చేసి, మిగతావి మాత్రమే లీక్ చేశారంటూ పేర్కొన్నారు.

భావోద్వేగంతో చేసిన వాఖ్యలే.. తప్ప వేరే ఉద్దేశ్యం లేదంటూ పేర్కొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. 33ఏళ్ళ రాజకీయాల్లో ఎప్పుడు తన రాజకీయ ప్రత్యర్ధులపై గానీ.. ఎవరిని కానీ దూషించలేదన్నారు. శత్రువులను సైతం దగ్గర తీసే తత్వం నాదన్నారు. తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు చేస్తానన్నారు.చదువుకున్న వ్యక్తిగా జనరల్ స్థానం అయిన నల్లగొండ మున్సిపాలిటీ ఛైర్మన్ గా వెంకట్ నారాయణ గౌడ్ కు అవకాశం ఇచ్చామన్నారు. నల్లగొండ మున్సిపాలిటీ 3 సార్లు జనరల్ అయినప్పటికీ ఆ మూడు సార్లు పట్టుబట్టి బలహీన వర్గాల వారికి దక్కేలా చూశానంటూ కోమటిరెడ్డి తెలిపారు. రికార్డు పెట్టారని తనకు కూడా తెలుసన్నారు.పార్టీ లో జాయిన్ అయిన నాటి నుంచి చెరకు సుధాకర్ తనను తిడుతున్నారన్నారు. ఎందుకు తిడుతున్నారని అడిగానన్నారు. చెరుకు సుధాకర్ పై పీడీయాక్ట్ పెడితే.. నేనే కోట్లాడాన్నారు. తనను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కొడుకుకు చెప్పానంటూ తెలిపారు. ఈ విషయంలో అన్యదా భావించొద్దని ప్రజలను కోరుతున్నానంటూ కోమటిరెడ్డి తెలిపారు. తనను సస్పెండ్ చేయాలని, దరిద్రులు అనడం వల్లే..భాధతో మాట్లాడానంటూ పేర్కొన్నారు. అయితే, నకిరేకల్‌లో తనపై పోస్టర్ లు వేసారని.. అవి ఎవరు వేసారో తెలుసంటూ తెలిపారు. తమ వాళ్ళు చంపెస్తారేమోనని భయంతో మాత్రమే చెప్పానంటూ వివరించారు. తనపై చేసిన వాఖ్యలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కు, ఇంఛార్జి ఠాక్రే ఫిర్యాదు చేశానంటూ వివరించారు. వెంకట్ రెడ్డి ని తిడితే నకిరేకల్ టికెట్ వస్తుందని అనుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు.

ఫిర్యాదు.. కోమటిరెడ్డి ఫ్లెక్సీల దగ్ధం..

కాగా.. చెరుకు సుధాకర్ ను చంపుతామని బెదిరింపుల తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద దుమారమే మొదలైంది. రాత్రికి రాత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ్లెక్సీలను తగులబెట్టారు సుధాకర్ అనుచరులు. బెదిరింపులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై మండిపడ్డారు చెరుకు సుధాకర్‌. తన కుమారుడిని చంపుతానని బెదిరించిన వ్యవహారంపై హై కమాండ్‌కు ఫిర్యాదు చేశానన్నారు. తాను నయీంకే భయపడలేదని, నయీం ఆవహించిన వెంకట్‌రెడ్డికి భయపడే ప్రసక్తే లేదంటున్నారు చెరుకు సుధాకర్‌. వ్యవహారం ఇంతలా శృతిమించడంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్లీ రియాక్ట్ అయ్యారు. భావోద్వేగంలో నోరు జారడం తప్ప తనకు ఎలాంటి శత్రుత్వం లేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..