Telangana Congress: మళ్లీ అలిగారా..? కోమటిరెడ్డిని కలిసిన ఠాక్రే.. కేసీ వేణుగోపాల్‌ ఫోన్‌.. అసలేమైంది..

|

Sep 06, 2023 | 4:24 PM

తెలంగాణ కాంగ్రెస్.. ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉంటారు.. కొంచెం తేడా వచ్చినా.. ఒకరిమీద ఒకరు ఫైర్.. అలకబూనడం ఇదంతా కామనే.. కానీ.. కొంతకాలం నుంచి మాత్రం అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టడం, త్వరలో ఎన్నికలు ఉండటంతో.. అంతర్గత పొరు ఉన్నా.. కొంచెం అటుఇటుగా.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం లాగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి అలిగారు.

Telangana Congress: మళ్లీ అలిగారా..? కోమటిరెడ్డిని కలిసిన ఠాక్రే.. కేసీ వేణుగోపాల్‌ ఫోన్‌.. అసలేమైంది..
Komatireddy Venkat Reddy-Manikrao Thakre
Follow us on

తెలంగాణ కాంగ్రెస్.. ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉంటారు.. కొంచెం తేడా వచ్చినా.. ఒకరిమీద ఒకరు ఫైర్.. అలకబూనడం ఇదంతా కామనే.. కానీ.. కొంతకాలం నుంచి మాత్రం అధిష్టానం ఫుల్ ఫోకస్ పెట్టడం, త్వరలో ఎన్నికలు ఉండటంతో.. అంతర్గత పొరు ఉన్నా.. కొంచెం అటుఇటుగా.. కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం లాగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి అలిగారు. సీడబ్ల్యూసీతోపాటు ముఖ్య కమిటీల్లో చోటు దక్కలేదని అలకబూనారు. దాంతో, AICC కార్యదర్శి సంపత్‌.. ఎంపీ కోమటిరెడ్డిని కలిసి చర్చలు జరిపారు. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు కోమటిరెడ్డి. ఆ తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు టీకాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్ ఠాక్రే. హుటాహుటిన కొమటిరెడ్డి దగ్గరకు వెళ్లిన మాణిక్‌రావ్ ఠాక్రే ఆయనతో చర్చలు జరిపారు. CWC, సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ, రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చోటు దక్కలేదు. ఇదే విషయంపై మాణిక్‌రావ్ ఠాక్రే ముందు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తంచేశారు. దాంతో, కేసీ వేణుగోపాల్‌తో ఫోన్‌లో మాట్లాడించారు ఠాక్రే. అయితే, తప్పక న్యాయం జరుగుతుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కేసీ వేణుగోపాల్ భరోసా ఇచ్చినట్టు చెప్పారు.

ఆ వార్తల్లో నిజం లేదన్న ఠాక్రే..

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అలిగారన్న వార్తల్లో నిజం లేదన్నారు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే. తనతో పాటు హైకమండ్‌ నేతలు కోమటిరెడ్డితో మాట్లాడారని అన్నారు. కేసీవేణుగోపాల్‌తో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఫోన్‌ చేయించారు మాణిక్‌రావు ఠాక్రే. అయితే, కోమటిరెడ్డి మా పార్టీ ముఖ్యనేత అని.. ఆయనకు సముచిత స్థానం అంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. మరోవైపు, ఏఐసీసీ ఎలక్షన్‌ అబ్జర్వర్‌ దీపదాస్‌ మున్సీని సమావేశమయ్యారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఎవరైనాసరే పోటీచేసేందుకు అవకాశం ఇవ్వాలంటూ లేఖ అందజేశారు. టిక్కెట్ల కేటాయింపులో మాజీ పీసీసీ అధ్యక్షుల సలహాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు జగ్గారెడ్డి. పొన్నాల లక్ష్మయ్య సహా మిగతా మాజీ పీసీసీ అధ్యక్షులు కోరితే టిక్కెట్లిచ్చి గౌరవించాలని కోరారు జగ్గారెడ్డి.

ముగిసిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం..

ఇదిలాఉంటే.. తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. తాజ్‌కృష్ణాలో జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ కీలక సమావేశం ముగిసింది. ఇప్పటికే ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ (PEC) సిద్ధం చేసిన జాబితాను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించనుంది. ప్రదేశ్‌ ఎలక్షన్‌ కమిటీ సిద్ధం చేసిన జాబితాలో ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురి పేర్లను ఎంపిక చేసి స్క్రీనింగ్‌ కమిటీ AICC ఎలక్షన్‌ కమిటీకి సీల్ట్‌ కవర్‌లో రిపోర్ట్‌ పంపనుంది. AICC ఒక్క అభ్యర్థి పేరును ప్రకటించింది. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన తాజ్‌కృష్ణాలో భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ మరోసారి సమావేశంకానున్నట్లు తెలుస్తోంది. పీఈసీలో వచ్చిన నివేదికఅంశాలపై సుదీర్ఘంగా చర్చించామని.. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..