AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komatireddy Raja Gopal Reddy: త్వరలోనే మార్పు.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

Komatireddy Raja Gopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యా్ఖ్యలు చేశారు. భవిష్యత్‌లో..

Komatireddy Raja Gopal Reddy: త్వరలోనే మార్పు.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..
Shiva Prajapati
|

Updated on: Jan 01, 2021 | 7:22 AM

Share

Komatireddy Raja Gopal Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యా్ఖ్యలు చేశారు. భవిష్యత్‌లో బీజేపీలో చేరతానని ప్రకటించారు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలుు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతోందన్నారు. బీజేపీ తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతుందని మొట్టమొదటగా చెప్పిన వ్యక్తిని తానేనని అన్నారు. ఇదే సమయంలో తన అన్న, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరతారా? అని మీడియా ప్రతినిథులు అడగగా ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. అన్నదమ్ములుగా కలిసే ఉన్నప్పటికీ రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వారివే అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక పీసీసీ చీఫ్ ఎంపికపైనా ఆయన స్పందించారు. పీసీసీ చీఫ్ పోస్ట్ కోసం రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తు్న్నారని చెప్పారు. అయితే వారి ప్రయత్నాలు ఎంత వరకు విజయవంతం అవుతాయో కాలమే నిర్ణయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

Also read:

Janasena Chief pawan kalyan: పవన్ ‘న్యూ’ విష్… కొత్త సంవత్సరం జాతిలోని వీరత్వాన్ని మేల్కొలపాలని ఆకాంక్ష

pawan kalyan: కొత్త సంవత్సరం కానుక… వకీల్ సాబ్ పోస్టర్ విడుదల… టీజర్ ఎప్పుడంటే..?