Kishan Reddy: మళ్లీ గెలుపు నాదే.. కామారెడ్డిలో ఓడిపోయినట్టే కేసీఆర్ వ్యాఖ్యలుంటాయి.. కిషన్‌రెడ్డి కౌంటర్..

|

Apr 24, 2024 | 1:53 PM

టీవీ9 రజనీకాంత్ లైవ్ షో విత్ కేసీఆర్‌ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యల చుట్టూ తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. కేసీఆర్‌కి బీజేపీ, కాంగ్రెస్ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అయితే, బీజేపీ గెలిచే సీట్లపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయగా.. బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Kishan Reddy: మళ్లీ గెలుపు నాదే.. కామారెడ్డిలో ఓడిపోయినట్టే కేసీఆర్ వ్యాఖ్యలుంటాయి.. కిషన్‌రెడ్డి కౌంటర్..
Kishan Reddy KCR
Follow us on

టీవీ9 రజనీకాంత్ లైవ్ షో విత్ కేసీఆర్‌ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత చేసిన వ్యాఖ్యల చుట్టూ తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. కేసీఆర్‌కి బీజేపీ, కాంగ్రెస్ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అయితే, బీజేపీ గెలిచే సీట్లపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయగా.. బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదన్న కేసీఆర్ ఆ పార్టీ అభ్యర్ధులు ఎవరూ గెలవరంటూ టీవీ9 లైవ్ షోలో కామెంట్ చేశారు. ఓ రకంగా చెప్పాలంటే ప్రత్యేకంగా కిషన్‌రెడ్డినే ఆయన టార్గెట్ చేశారు. సికింద్రాబాద్ ఎంపీ సీటును బీజేపీ గెలవదని.. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు. సికింద్రాబాద్‌లో బీజేపీ గెలవదన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కిషన్‌రెడ్డి కౌంటర్ ఇస్తూ.. కామారెడ్డిలో ఫలితాన్ని గుర్తు చేసుకోవాలని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అలా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదని.. పద్మారావు గౌడ్ ఎంపీగా కాదు.. ఎమ్మెల్యేగా గెలిచారని.. ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పబోయి.. ఎంపీగా గెలిచారని చెప్పినట్టున్నారంటూ విమర్శించారు. సికింద్రాబాద్‌లో ఈసారి కూడా గెలుపు తనదే అంటూ కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు.

మరోవైపు సికింద్రాబాద్‌లో గెలుపు తమదంటే తమదే అంటూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ధీమాగా చెబుతున్నాయి.

కిషన్ రెడ్డి మాట్లాడిన వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..