Khammam: ఆర్టీసి కార్గోలో చీరలు పార్సిల్.. తీరా వచ్చాక పార్సిల్ విప్పి చూస్తే..
ఆర్టీసీ కార్గో సేవలు వినియోగించుకున్న ఓ కస్టమర్‌కు విచిత్ర అనుభవం ఎదురైంది. విలువైన చీరలు ఎలుకలు కొట్టడంతో.. సదరు కస్టమర్ కంగుతిన్నారు. వెంటనే అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులో చర్చింది.. సమస్యను పరిష్కరించే యత్నం చేస్తమని అక్కడి సిబ్బంది తెలిపారు.

ఇటీవల కాలంలో ఆర్టీసి కార్గో సేవలకు బాగా డిమాండ్ పెరిగింది. తక్కువ ఖర్చుతో ఏ వస్తువు అయినా ఈజీగా పంపేందుకు ఈ సేవలను ఆర్టీసి అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను జనాలు బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు. దీని ద్వారా ఆర్టీసీకి మంచి ఆదాయం కూాడా వస్తూ ఉండటంతో.. సంస్థ కూడా మరింత నాణ్యమైన సేవలు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఖమ్మంలో ఆర్టీసి కార్గో పార్సిల్‌లో అందుకున్న ఓ కస్టమర్ షాక్ గురయ్యాడు. ఖమ్మం కొత్త బస్టాండ్ కార్గో పార్సిల్ కేంద్రంలో విలువైన చీరలను ఎలుకలు కొరికాయి. దీంతో బాధితులు డిపో మేనేజర్ శ్రీనివాస్‌కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు.
ఖమ్మం నగరానికి చెందిన విజయ అనే మహిళ చీరల వ్యాపారం చేస్తుంది. ఈ నెల 25 న హుస్నాబాద్‌లో చీరలు కొని వాటిని ఖమ్మం పంపేందుకు ఆర్టీసీ కార్గో పార్సిల్ లో వేశారు. అదే రోజు సాయంత్రం పార్సిల్ ఖమ్మం చేరుకుంది. బుకింగ్ సమయంలో హుస్నాబాద్ లో రెండు రోజులు పడుతుందని చెప్పినట్లు బాధితురాలు తెలిపారు. తమకు సమాచారం అందకపోవడంతో బుధవారం ఖమ్మం కార్గో కేంద్రానికి వెళ్లారు. తమ పార్సిల్ బ్యాగ్ గురించి ఆరా తీసి..వాటిని ఓపెన్ చేయగా ఆమె ఖంగుతిన్నారు. చీరలు ప్యాకింగ్ చేసిన బ్యాగ్ ను ఎలుకలు కొరికిన విషయాన్ని గమనించి కార్గో సిబ్బందిని ప్రశ్నించారు. తాము గతంలో ఎప్పుడూ ఇలాంటి సమస్యను చూడలేదని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అక్కడి స్టాఫ్ సమాధానం ఇచ్చారు.
40 వేల విలువైన సరకు పార్సిల్ చేయగా 3 వేల రూపాయల విలువ చేసే చీరలు ఎలుకలు కొరికి పాడయ్యాయని తనకు న్యాయం చేయాలని డీఎంకు బాధితులు ఫిర్యాదు చేశారు. కార్గో కేంద్రంలో ఉన్న వేరే బ్యాగులను కూడా ఎలుకలు కొట్టి ఉండడంతో వాటికి సంబందించిన వారు వస్తె వాటి పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు అక్కడి సిబ్బంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
