AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్నో కలలతో చదివిస్తే చంపేశారు కదరా.. వేధింపులతో పాపం యువ డాక్టర్..

ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.. ఎండీ కోర్సు పూర్తి చేసి.. సామాన్యులకు వైద్యం అందించాలనుకున్నాడు.. ఇంతలోనే హెచ్ఓడీ, సిబ్బండి వేధింపులకు యువ డాక్టర్ బలయ్యాడు.. మహారాష్ట్ర షిర్డీలో ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన మరీదు వినోద్ (30) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఎన్నో కలలతో చదివిస్తే చంపేశారు కదరా.. వేధింపులతో పాపం యువ డాక్టర్..
Doctor suicide at Shirdi
N Narayana Rao
| Edited By: |

Updated on: Sep 29, 2025 | 1:36 PM

Share

ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.. ఎండీ కోర్సు పూర్తి చేసి.. సామాన్యులకు వైద్యం అందించాలనుకున్నాడు.. ఇంతలోనే హెచ్ఓడీ, సిబ్బండి వేధింపులకు యువ డాక్టర్ బలయ్యాడు.. మహారాష్ట్ర షిర్డీలో ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన మరీదు వినోద్ (30) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన మరీదు కిషోర్, కోటేశ్వరి దంపతులకు వినోద్ ఏకైక కుమారుడు.. వినోద్ ను ఉన్నతంగా చదివివించారు.. వినోద్ డాక్టర్ కావాలని కలలు కన్నాడు. రష్యాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు.. ఆ తర్వాత షిరిడీలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రస్తుతం పీడియాట్రిక్ లో వినోద్ ఎండీ కోర్సు చదువుతున్నాడు. మరో ఆరు నెలల్లో కోర్సు పూర్తి కానుంది.. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీలో హెచ్ఓడీ, కొందరు సిబ్బంది వేధింపులు గురి చేయడంతో మనస్థాపానికి గురైన వినోద్.. తన రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తల్లి దండ్రులు కష్టపడి, అప్పులు చేసి ఎన్నో ఆశలతో కొడుకును ఎంబిబిఎస్ చదివించారు.. పీజీ కూడా పూర్తి చేయించి..డాక్టర్ గా చూడాలని వారు ఎన్నో కలలు కన్నారు.. ఇంతలోనే.. వారి ఆశలు అడియాశలయ్యాయి.. వినోద్ చిన్నతనం నుంచి చదువుల్లో మెరిట్ స్టూడెంట్.. అని.. చదువే లోకంగా ఉండేవాడని గ్రామస్థులు తెలిపారు. వినోద్ ను తరచూ అవమానాలకు గురిచేయ్యడంతోపాటు.. వేధింపులకు గురిచేయ్యడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతితో తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.. వినోద్ మృతితో రాయన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..