AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: దేశంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి.. కేంద్రంపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్‌.

దేశంలో ప్రస్తుతం ఎమర్జన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. శనివారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ శనివారం హైదరాబాద్‌ వచ్చిన విషయం తెలిసిందే...

CM KCR: దేశంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయి.. కేంద్రంపై విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్‌.
Kcr Press meet
Narender Vaitla
|

Updated on: May 27, 2023 | 5:44 PM

Share

దేశంలో ప్రస్తుతం ఎమర్జన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శించారు. శనివారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ శనివారం హైదరాబాద్‌ వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరూ కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం ప్రగతి భవన్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌, కేసీఆర్‌లు సంయుక్తంగా ప్రెస్‌మీటర్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై ముగ్గురు ముఖ్యమంత్రులు విరుచుకు పడ్డారు.

కేజ్రీవాల్‌కు మా మద్ధతు: కేసీఆర్‌

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోందని ఆరోపించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో కేంద్ర బీజేపీ బీజేపీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఎమర్జెన్సీపై బీజేపీ నేతలకు విమర్శించే నైతిక హక్కులేదని, ఇప్పుడు వారి తీరు అలాగే ఉందన్నారు. లోక్ సభలో, రాజ్యసభలో తమ శక్తిని ఉపయోగించి.. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకునేలా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అరవింద్ కేజ్రీవాల్‌కు తమ మద్దతు ఉంటుందన్నారు. దేశంలో మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే మేయర్ కాకుండా కేంద్రం కొర్రీలు పెట్టిందన్నారు.

సీఎం ఇంకా మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమ్ ఆద్మీ మేయర్ సీటును కైవసం చేసుకుంది. గ్రూప్-1 అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ పరిధిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పనిచేయాలని ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ను కాదని కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చింది. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయి…ఆ సంఘటనలు జరుగుతున్నాయి. ఇందిరా గాంధీ లాంటి నాయకులకే ఓటమి తప్పలేదు. కేంద్రం ఇందిరా గాంధీ అవలంబించిన ఎమర్జెన్సీ దారిలో ఉన్నారు. మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమాణిస్తోంది. మోడీ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలి. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ..గవర్నర్లు ఏంది? గవర్నర్ వ్యవస్థతో పాలన ఎక్కడికి వెళ్తుందో దేశం అంతా గమనిస్తోంది. వంగి వంగి దండాలు పెట్టినా కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించార’ని ఫైర్‌ అయ్యారు.

ఇవి కూడా చదవండి

Arvind Kejriwal

మా పోరాటం దేశ కోసం: కేజ్రీవాల్‌

ఇక ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన సీఎం కేజ్రీవాల్‌ తమ పోరాటం కేవలం ఢిల్లీ కోసం మాత్రమే కాదని దేశం కోసమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సుదీర్ఘ చర్చ జరిగిందన్న కేజ్రీవాల్‌.. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఉన్నప్పుడు అధికారాలు అన్ని రాష్ట్ర ప్రభుత్వం వద్దే ఉన్నాయి.. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వచ్చిన మూడు నెలలకే అధికారాలను తీసివేశారన్నారు. మేము 8 ఏళ్లు ఢిల్లీ ప్రజల కోసం పోరాటం చేశాము… సుప్రీంకోర్టులో 8 ఏళ్ల తరువాత న్యాయం జరిగిందన్నారు. సుప్రీంకోర్టులో న్యాయం జరిగినా.. దానిని కాదని కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని కేజ్రీవాల్‌ గుర్తుచేశారు. సుప్రీంకోర్టు లోనే న్యాయం జరగకపోతే దేశ ప్రజలు ఎక్కడి వెళ్లి చెప్పుకోవాలని ప్రశ్నించారు. నాన్ బీజేపీ ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రాన్ని కేంద్రం పాలన చేసుకొనివడం లేదన్న కేజ్రీవాల్‌.. ED, సీబీఐ పంపి బెదిరించి ఎమ్మెల్యేలను కొంటారు ప్రభుత్వాలను కూల్చుతారని ఆరోపించారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ నిలిపివేశారు: మాన్ సింగ్

ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన పంజాబ్‌ సీఎం.. భగవంత్ సింగ్ మాన్ తాము దేశ ప్రజల హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నామని తెలిపారు. పంజాబ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు నడిచేందుకు గవర్నర్ సహకరించలేదని.. సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో గవర్నర్ బడ్జెట్ సమావేశాల్లో నా ప్రభుత్వం అని చదువుతూ ప్రారంభించారని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ నిలిపివేశారి కేంద్రాన్ని విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఇండియా… ఒకే పువ్వు ఉండటం కుదరదని, దేశం ఒక మాల లాంటిది మలలో అన్ని రకాల పూలు ఉంటాయని మాన్‌ సింగ్ స్పష్టం చేశారు.

Cm Kcr

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us