Kavitha Maloth: ఎంపీ మాలోత్‌ కవితకు షాక్‌.. డబ్బు పంపిణీ కేసులో 6 నెలల జైలుశిక్ష

|

Jul 24, 2021 | 5:41 PM

Maloth Kavitha: మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు చుక్కెదురైంది. ఓటర్లకు డబ్బు పంపిణీ కేసులో కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతోపాటు.. రూ.10వేలు జరిమానా కూడా విధిస్తూ ప్రజా ప్రతినిధుల

Kavitha Maloth: ఎంపీ మాలోత్‌ కవితకు షాక్‌.. డబ్బు పంపిణీ కేసులో 6 నెలల జైలుశిక్ష
Mp Malothu Kavitha
Follow us on

Maloth Kavitha: మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు చుక్కెదురైంది. ఓటర్లకు డబ్బు పంపిణీ కేసులో కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతోపాటు.. రూ.10వేలు జరిమానా కూడా విధిస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పును వెలువడించింది. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బులు పంచారన్న కేసులో కోర్టు తీర్పునిచ్చింది. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో.. మాలోత్‌ కవిత ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్లు బూర్గంపహాడ్ పోలీసులు కేసు నమోదైంది. దీనికి సంబంధించి శనివారం కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. కాగా ఈ కేసుకు సంబంధించి ఎంపీ కవిత వెంటనే రూ.10వేల జరిమానా చెల్లించగా.. ప్రజా ప్రతినిధుల కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది.

మాజీ మంత్రి రెడ్యా నాయక్ కూతురైన మాలోత్‌ కవిత తన రాజకీయ జీవితాన్ని 2009లో ప్రారంభించారు. మొదట కాంగ్రెస్‌లో ఉన్న ఆమె అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆమె మహబూబాబాద్‌ పార్లమెంటు స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Also Read:

Viral Video: ఇదేం ఖర్మరా బాబూ.. మరికొన్ని క్షణాల్లో పెళ్లి.. ల్యాప్‌టాప్‌ పట్టుకొని వేదికపై కూర్చున్న వరుడు..

CM KCR: ‘దళితుల భవిష్యత్ గురించే ఆలోచిస్తున్నాం’.. ఎంపీటీసీ భర్తతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఆడియో వైరల్