Telangana Congress: రంగంలోకి డీకే శివకుమార్.. బెంగళూరు వేదికగా టీకాంగ్రెస్‌ రాజకీయాలు..

|

Jun 11, 2023 | 4:18 PM

Telangana Congress politics in Bangalore: తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా హీట్‌ పెరిగింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరటం దాదాపు తథ్యమనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా..

Telangana Congress: రంగంలోకి డీకే శివకుమార్.. బెంగళూరు వేదికగా టీకాంగ్రెస్‌ రాజకీయాలు..
Telangana Congress
Follow us on

Telangana Congress politics in Bangalore: తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా హీట్‌ పెరిగింది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరటం దాదాపు తథ్యమనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ ముగ్గురు నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో కలిసి నిన్న బెంగళూరు వెళ్లినట్టు తెలుస్తోంది. కర్నాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్‌ నివాసంలో చర్చలు జరిగినట్టు సమాచారం. వీళ్ల చేరిక, పార్టీలో గౌరవానికి సంబంధించి హైకమాండ్‌ పెద్దలతో శివకుమార్‌ చర్చించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరికకు సంబంధించి నేడో, రేపో ఈ నాయకులు డైలమాకు ముగింపు పలుకుతారని తెలంగాణ కాంగ్రెస్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీతో ఫైట్‌ చేసే స్థాయి BRSకు లేదని సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ వీడిన పాత మిత్రులందరిని తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. పొంగులేటి, జూపల్లి చేరనున్నారని ప్రచారం జరుగుతున్న సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో టీవీ9 ప్రత్యేకంగా మాట్లాడింది. కర్నాటక తరహా ఫార్మూలాతోనే తాము తెలంగాణలో ముందుకు వెళ్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ కచ్చితంగా గెలుస్తుందని స్పష్టం చేశారు. టికెట్ల విషయమై తాను ప్రియాంకా గాంధీతోనూ మాట్లాడానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీవీ9తో చెప్పారు. తాను కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదినని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఈ నెల 18 లేదా 19న నల్లగొండలో ప్రియాంక గాంధీతో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే, షర్మిల పార్టీలోకి చేరతామంటే బేషరతుగా ఆహ్వానిస్తామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని సీనియర్‌ నేత శ్రీధర్‌ బాబు అన్నారు. తమ పథకాలను ఇతర పార్టీలు కాపీ కొడుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రజలకు మేలు చేర్చే బృహత్‌ ప్రణాళికను త్వరలోనే తీసుకొస్తామని శ్రీధర్‌ బాబు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..