Crime News: పట్టపగలే భారీ చోరీ! బైక్‌పై వచ్చి రూ.15 లక్షలు అపహరించిన దొంగలు
నగరంలో పట్టపగలే దొంగలు బరితెగించారు. రద్దీగా ఉన్న రోడ్డుపై బైక్‌పై వచ్చిన దుండగులు లక్షల రూపాయల నగదును లాక్కుని పరారయ్యారు. తాజా సంఘటన స్థానికంగా కలకలం..

Telangana Crime news: నగరంలో పట్టపగలే దొంగలు బరితెగించారు. రద్దీగా ఉన్న రోడ్డుపై బైక్‌పై వచ్చిన దుండగులు లక్షల రూపాయల నగదును లాక్కుని పరారయ్యారు. తాజా సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడీమిక్స్‌లో అకౌంటెంట్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న చంద్రప్రకాష్, మల్లారెడ్డి సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. తమ కంపెనీలో ఉద్యోగులకు జీతాలను ఇవ్వడానికి గానూ రూ.15 లక్షల చెక్కులను డ్రా చేసుకోవడానికి సోమవారం ఉదయం 11 గంటల 20 నిముషాలకు SBI బ్యాంక్‌కు వచ్చారు. మల్లారెడ్డి, చంద్రప్రకాష్‌లు బ్యాంకులోకి ప్రవేశించినప్పటి నుంచి బ్లూ టీషర్ట్, బ్లాక్ కలర్ షర్టు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఫాలో అయ్యారు. డబ్బు డ్రా చేసుకుని బయటకు వచ్చిన చంద్రప్రకాష్, మల్లారెడ్డి బైకుపై సంస్థకు తిరిగి వెళ్తున్నారు. ఐతే బ్లూ టీషర్ట్, బ్లాక్ కలర్ షర్టు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు హెల్మె్ట్లు ధరించి బైకుపై వేగంగా వచ్చి చంద్రప్రకాశ్ వద్ద ఉన్న సంచిని లాక్కుని పరారయ్యారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు దొంగలు కనిపించకుండా పారిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంకుతోసహా, పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. మల్లారెడ్డి, చంద్రప్రకాష్‌ల కదలికపై పథకం ప్రకారం రెక్కీ నిర్వహించి డబ్బును దొంగిలించనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నగరంలోని వివిధ ప్రదేశాల్లో పోలీసు బృందాలు దొంగల కోసం గాలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
