Kamareddy: మాస్టర్ జోన్ ఎత్తివేసే వరకు ఆందోళన.. కామారెడ్డి రైతు జేఏసీ కీలక నిర్ణయం..

మాస్టర్ జోన్ ఎత్తివేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ చేసి.. 49 మంది కౌన్సిలర్లు మున్సిపల్ నుంచి తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

Kamareddy: మాస్టర్ జోన్ ఎత్తివేసే వరకు ఆందోళన.. కామారెడ్డి రైతు జేఏసీ కీలక నిర్ణయం..
Kamareddy Jac Meeting
Follow us

|

Updated on: Jan 08, 2023 | 12:24 PM

కామారెడ్డి రైతు జేఏసీ అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్టర్ జోన్ ఎత్తివేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ చేసి.. 49 మంది కౌన్సిలర్లు మున్సిపల్ నుంచి తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు తీర్మానం చేసిన కాపీలను రైతులకు చూయించాలన్నారు. రైతుల భూముల నుంచి ప్లాన్ తీసేసి.. మొత్తం ప్రభుత్వ భూముల్లోనే మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు రైతు జేఏసీ నాయకులు. దీనికోసం రేపు 49మంది కౌన్సిలర్లకు వినతిపత్రాలు ఇస్తామని చెప్పారు రైతు జేఏసీ నాయకులు. లేని పక్షంలో 11వ తారీఖున మున్సిపల్ కార్యాలయం ముందు వంటవార్పు కార్యాక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు రైతు జేఏసీ నాయకులు.

అంతకుముందు వడ్లూరు ఎల్లారెడ్డిలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు భేటీ అయ్యారు. రైతు జేఏసీ సమావేశానికి ఏడు గ్రామాల రైతులు హాజరయ్యారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సైతం హాజరయ్యారు.

కామారెడ్డి పట్టణ నూతన మాస్టర్‌ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ.. నెల రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నారు. సాగు భూములను పరిశ్రమల జోన్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కలెక్టర్‌ జితేశ్‌ పాటిల్‌ స్పందించారు. ముసాయిదాపై స్పష్టతనిచ్చారు. మాస్టర్ ప్లాన్‌ ముసాయిదా దశలో ఉందని.. ఇంకా ఫైనల్‌ కాలేదని ఆయన వెల్లడించినప్పటికీ.. రైతులు వెనక్కి తగ్గడం లేదు.

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లోకి ఇండస్ట్రియల్‌ జోన్‌ మారుస్తామని తేల్చి చెప్పారు. గ్రీన్‌ జోన్‌ కూడా ప్రభుత్వ భూములకు మారుస్తామని వివరించారు. ఇల్చిపూర్, అడ్లూర్, టేక్రియాల్ భూములను.. ఇండస్ట్రియల్ జోన్‌ నుంచి తొలగిస్తామని గంప గోవర్థన్‌ హామీ ఇచ్చారు.

కన్సెల్టెన్సీ సంస్థ చేసిన తప్పిదం వల్లే ఈ గందరగోళం చోటు చేసుకుందని అన్నారు. కౌన్సిల్‌ సమావేశం తర్వాత మాస్టర్‌ ప్లాన్‌పై ముందుకు పోతామని చెప్పారు. కాగా, శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఆందోళన ఘటనకు సంబంధించి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మరో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..