Kaloji University: బీఎస్సీ నర్సింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం..

Kaloji University: వివిధ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతూ కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఎస్సీ నర్సింగ్..

Kaloji University: బీఎస్సీ నర్సింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం..

Updated on: Jan 18, 2021 | 12:43 PM

Kaloji University: వివిధ వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతూ కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్‌టీ, బీపీటీ, పీబీబీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సులకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. జనవరి 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అభ్యర్థులు సంబంధిత కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సు, రెండేళ్ల పీబీబీఎస్సీ నర్సింగ్ కోర్సు, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్‌టీ కోర్సుల్లో సీట్లు ఉన్నాయని, ఆయా కోర్సులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా, వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తామని చెప్పారు.

Also read:

Corona Virus Threat: కరోనా ముప్పు వీరికి వచ్చే ఛాన్స్‌లు చాలా తక్కువట.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సీరో సర్వే..

విముక్తి కోసం పోరాటం, పాక్ లోని సింధ్ లో ప్రో-ఫ్రీడమ్ ర్యాలీ, ప్రధాని మోదీ, ప్రపంచ నాయకుల కటౌట్లు, బ్యానర్లు.