KA Paul: సీఎం కేసీఆర్ పుట్టినరోజునే ఎందుకు సెక్రటేరియట్ ఓపెన్ చేయాలి.. సీబీఐకి కేఏ పాల్ లేఖ..

కొత్త సచివాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ.. సీబీఐకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లేఖ రాశారు. సచివాలయం లోపలికి మీడియాను అనుమతించకపోవడంపై అనుమానాలు....

KA Paul: సీఎం కేసీఆర్ పుట్టినరోజునే ఎందుకు సెక్రటేరియట్ ఓపెన్ చేయాలి.. సీబీఐకి కేఏ పాల్ లేఖ..
Ka Paul
Follow us

|

Updated on: Feb 05, 2023 | 9:38 PM

కొత్త సచివాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ.. సీబీఐకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లేఖ రాశారు. సచివాలయం లోపలికి మీడియాను అనుమతించకపోవడంపై అనుమానాలు ఉన్నాయన్నారు. సెక్రటేరియట్ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు.. ఆరో అంతస్తు వరకు వ్యాపించాయని చెప్పారు. డోమ్ ల నుంచి వెలువడిన పొగ చూస్తుంటే.. ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని తెలుస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజునే ఎందుకు సెక్రటేరియట్ ఓపెన్ చేయాలన్న కేఏ పాల్… ప్రజాధనంతో కట్టిన సచివాలయాన్ని అంబేడ్కర్ జయంతి రోజునే ఓపెన్ చేయాలని డిమండ్ చేశారు. కేసీఆర్ కు మూఢనమ్మకాలు ఎక్కువని ఆక్షేపించారు. సెక్రటేరియట్ లో ఏం జరుగుతోందో చెప్పాలని నిలదీశారు.

బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని దివాళా తీయించారు. శ్రీకాంతాచారి తండ్రి వెంకటాచారిని కిడ్నాప్ చేశారు. ప్రజాశాంతి పార్టీలో చేరినందుకు ఆయనను కిడ్నాప్ చేశారు. సచివాలయం బిల్డింగ్ లో అగ్నిప్రమాదం జరిగి ఐదు రోజులు అయింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మీడియాను ఎందుకు అనుమతి ఇవ్వలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఈ విషయంపై ప్రశ్నించడం లేదు.

       – కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు

ఇవి కూడా చదవండి

కాగా.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయంలో ఇటీవల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 11 అగ్ని మాపక యంత్రాలతో రంగంలోకి దిగి మంటలు అదుపు చేశాయి. ఫైర్ సేఫ్టీ అన్ని రకాల పనులను చెక్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..