AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Budget 2023: నేడే తెలంగాణ బడ్జెట్.. సంక్షేమ రంగానికి అధిక కేటాయింపులు!

ఇవాళే తెలంగాణ బడ్జెట్.! కేబినెట్‌ కూడా ఆమోదముద్ర వేసింది. మరీ ఎన్నికల బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఏయే రంగాలు ప్రాధాన్యం ఇస్తారు? కొత్త పథకాలు ఉంటాయా..?

Telangana Budget 2023: నేడే తెలంగాణ బడ్జెట్.. సంక్షేమ రంగానికి అధిక కేటాయింపులు!
Telangana Budget 2023 24
Shiva Prajapati
|

Updated on: Feb 06, 2023 | 6:20 AM

Share

ఇవాళే తెలంగాణ బడ్జెట్.! కేబినెట్‌ కూడా ఆమోదముద్ర వేసింది. మరీ ఎన్నికల బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఏయే రంగాలు ప్రాధాన్యం ఇస్తారు? కొత్త పథకాలు ఉంటాయా..? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2022-24 వార్షిక బడ్జెట్ దాదాపు 3 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే పద్దు కావడంతో ప్రభుత్వం పెద్ద కసరత్తే చేసినట్లు తెలుస్తోంది! ముఖ్యంగా సంక్షేమ రంగానికి అధిక కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది.

ఉదయం ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్‌.. బడ్జెట్‌ను ఆమోదించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి బుణాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సమావేశాలకు మంత్రులు అందరు తప్పకుండా హాజరు కావాలిని ఆదేశించారు సీఎం . కేసీఆర్‌ నాందేడ్‌కు వెళ్లడంతో 10 నిమిషాల్లోనే ముగిసింది మంత్రివర్గ సమావేశం.

రైతుబంధు, దళితబంధు, రుణమాపీ, ఉచిత విద్యుత్‌ వంటి పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. వీటికే దాదాపు 50 వేల కోట్లకుపైగా ఇవ్వాలని ప్రతిపాదనలు అందాయి.. సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాలకు భారీగానే నిధులు ఇవ్వాల్సి ఉంది. సొంత స్థలం ఉన్నవాళ్లు ఇళ్లు నిర్మించుకోవడం కోసం…3 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేరుస్తారని తెలుస్తోంది. నిరుద్యోగభృతి విషయంలో ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. రేపు ఉదయం 10.30కు అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు..శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా బడ్జెట్‌ సమావేశాలు మార్చ్‌లో పెడుతారు. కానీ ఈసారి మాత్రం ఫిబ్రవరి రెండో వారంలో సమావేశాలు ముగుస్తున్నాయి. అంటే బడ్జెట్‌ ఆమోదం పొందిన 47 రోజుల వరకూ పాత పద్దే అమల్లో ఉంటుంది. ఏప్రిల్‌-1 తర్వాత కొత్త బడ్జెట్ అమల్లోకి వస్తుంది. పద్దుల అధ్యయనం కోసం 7వ తేదీ సభకు సెలవు ఇచ్చారు. 8న బడ్జెట్‌ పద్దులపై చర్చఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
7 ఏళ్ల చిన్నారి దెబ్బకు కదిలిన యంత్రాంగం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై కీలక నిర్ణయం..!
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
పీఎం కిసాన్‌ 24వ విడత డబ్బులపై కీలక అప్‌డేట్‌.. వచ్చేది అప్పుడేనా
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!
వెలిగొండ వరద ధాటికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..!