వీరాభిమానం.. తమకు చూపించాలనుకున్నాడు.. అతివుత్సాహం ప్రదర్శించాడు. తన నేతకు తమకున్న అభిమానాన్ని చాటుకోవడానికి నయా స్టైల్ ఎంచుకున్నాడు. అందిరికంటే కొంత కొత్తగా.. వెరైటీగా ఆలోచించాడు. సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.. మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు తన నియోజక వర్గంలోనే కాదు పక్క నియోజకవర్గాల్లో కూడా మంచి పట్టుంది. అక్కడ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తాజాగా ఓ అభిమాని ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించాడు.
బాల్క సుమన్ అనుచరుడు కొప్పుల రవి చేసిన పని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. కొప్పుల రవి ఏం చేశాడంటే.. తుపాకీ బుల్లెట్స్‌తో “జై బాల్క సుమన్” అని వాట్సప్ స్టేటస్పె ట్టుకున్నాడు. సీఎం కేసీఆర్ సింగరేణిలో లాభాల వాటా 30 శాతం ప్రకటించిన సందర్భంగా ఈ అభిమాని ఉబ్బితబ్బిబ్బయిన కొప్పుల రవి ఇలా తన అభిమానాన్ని చూపించుకున్నాడు. ఆనందం తట్టుకోలేక బుల్లెట్లతో థ్యాంక్స్ చెప్పాడు. సింగరేణి కార్మికుడు కొప్పుల రవి ఇలా వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకోవడంతో బయటపడ్డ బుల్లెట్ల కథ సోషల్ మీడియాను కుదిపేసింది.
రవి వాట్సప్ స్టేటస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మారడంతో అది కాస్తా పోలీసుల వరకు వెళ్లింది. ఈ స్టేటస్ పెట్టిన రవి.. ప్రస్తుతం శ్రీరాంపూర్ డివిజన్‌లో సింగరేణి కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
అయితే.. ఒక సింగరేణి కార్మికుడికి బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పుడు సోషల్ మీడియాకు కుదిపేస్తున్న ప్రశ్న. ఈ కోణంలోనే పోలీసులు విచారణ మొదలు పెట్టారు. బుల్లెట్లు అసలువో, నకిలీవో తేల్చేపనిలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కొప్పుల రవి పెట్టిన స్టేటస్‌లో దాదాపు 62 బుల్లెట్లు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇన్ని బుల్లెట్లు ఓ సామాన్య వ్యక్తికి ఎలా వచ్చాయనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం