AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Immersion: సమాజ సేవలో మేము సైతం.. నిమజ్జన విధుల్లో పాల్గొన్న 17 మంది ట్రాన్స్‌జెండర్లు

దేశ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సారి జగిత్యాల జిల్లాల్లో జరిగిన నిమజ్జన వేడుకల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేయగా.. ఈ భద్రతా బందోస్తులో సుమారు 17 మంది ట్రాన్స్ జెండర్స్ పాల్గొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వహించారు.

Ganesh Immersion: సమాజ సేవలో మేము సైతం.. నిమజ్జన విధుల్లో పాల్గొన్న 17 మంది ట్రాన్స్‌జెండర్లు
Jagitial Ganesh Immersion
Anand T
|

Updated on: Sep 25, 2026 | 4:33 PM

Share

జగిత్యాల జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. నిమజ్జనాల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సారి కూడా గతేడాది మాదిరి వినాయక నిమజ్జన వేడుకల బందోబస్తులో ట్రాన్స్‌ జెండర్లను భాగస్వాములుగా చేశారు పోలీసులు. ఈ సారి ఏకంగా 17 మంది ట్రాన్స్‌జెండర్లు నిమజ్జన వేడుకల బందోబస్తు విధుల్లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ నిమజ్జన కేంద్రాలకు భక్తులు భారీ సంఖ్యలో గణనాథులు తరలిరావడంతో ట్రాన్స్‌జెండర్ సిబ్బంది పోలీసులతో కలిసి చురుగ్గా విధులు నిర్వర్తించారు. జనసమూహాలను నియంత్రించడంతో పాటు, ట్రాఫిక్‌ను అదుపు చేయడం, అలాగే శాంతిభద్రతల పరిరక్షణలో వారు పోలీసులకు సహాయం అందించారు.

గతేడాది కూడా నిమజ్జన వేడుకల బందోబస్తు విధుల్లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్లు అంకితభావంతో, క్రమశిక్షణతో తమ బాధ్యతలను నిర్వర్తించినట్టు పోలీసులు తెలిపారు. వారు అందించిన సేవలు వేడుకల్లో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడడంతో ఎంతో సహాయపడ్డాయని తెలిపారు. వారి సేవకు గాను వారికి అనేక ప్రసంశలు కూడా దక్కాయని తెలిపారు.

ఇదిలా ఉండగా తమపై పూర్తి నమ్మకం ఉంచి, భద్రతా ఏర్పాట్లలో పాల్గొనే అవకాశం కల్పించిన ట్రాన్స్‌జెండర్ సిబ్బంది సైతం జగిత్యాల జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖ తమకు అప్పగించిన గౌరవం, బాధ్యత తమలో ఎంతగానో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాల్లో మరింత నిబద్ధతతో సేవలందించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు వారు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జగిత్యాల గణేష్ నిమజ్జన బందోబస్తులో భాగమైన ట్రాన్స్‌జెండర్స్
జగిత్యాల గణేష్ నిమజ్జన బందోబస్తులో భాగమైన ట్రాన్స్‌జెండర్స్
కనుబొమ్మలు పలుచగా ఉన్నాయా? దట్టంగా కనిపించాలంటే నేచురల్ టిప్స్!
కనుబొమ్మలు పలుచగా ఉన్నాయా? దట్టంగా కనిపించాలంటే నేచురల్ టిప్స్!
జామ ఆకులను ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్..
జామ ఆకులను ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్..
ఏటీఎం లావాదేవీలు ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు ఉండవ్..
ఏటీఎం లావాదేవీలు ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు ఉండవ్..
రన్నింగ్ vs సైక్లింగ్.. బరువు తగ్గడానికి ఏది మంచిదో తెలుసా?
రన్నింగ్ vs సైక్లింగ్.. బరువు తగ్గడానికి ఏది మంచిదో తెలుసా?
APPSC Group 1 దరఖాస్తుకు ముందు అభ్యర్థులు తప్పక తెలుసుకోవాలి
APPSC Group 1 దరఖాస్తుకు ముందు అభ్యర్థులు తప్పక తెలుసుకోవాలి
AI తప్పిదం వల్లే.. ఇరాన్ పాఠశాలపై అమెరికా బాంబుల వర్షం
AI తప్పిదం వల్లే.. ఇరాన్ పాఠశాలపై అమెరికా బాంబుల వర్షం
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి
ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి
ఐబొమ్మ పైరసీ కేసులో బిగ్‌ అప్‌డేట్.. ఇమంది రవీకి భారీ ఊరట!
ఐబొమ్మ పైరసీ కేసులో బిగ్‌ అప్‌డేట్.. ఇమంది రవీకి భారీ ఊరట!
తెలుగు రాష్ట్రాలకు భారీ రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
తెలుగు రాష్ట్రాలకు భారీ రెయిన్ అలర్ట్.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..