itoconnect: ఎన్నికల రణరంగానికి టెక్నాలజీ టచ్.. ఐటూకనెక్ట్
తాజాగా ఐటూకనెక్ట్ అనే కంపెనీ ఎన్నికల ప్రచార శైలిలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎన్నికల ప్రచార శైలినే మార్చేసింది. ఎన్నికల ప్రచారంలో ఎదురయ్యే అడ్డంకులను అదిగమించడంలో ఐటూకనెక్ట్ వ్యూహాత్మకమని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 2023లో స్థాపించిన ఈ ఐటూకనెక్ట్ సేవలు...

మారుతోన్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీలోనూ మార్పులు వస్తున్నాయి. అన్ని రంగాల్లో టెక్నాలజీ వినియోగం అనివార్యంగా మారింది. ఇప్పుడు రాజకీయాలను కూడా టెక్నాలజీ శాసిస్తోంది. భారతదేశంలో ఎన్నికల ప్రచార శైలిలో భారీ మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టెక్నాలజీ వినియోగం సైతం పెరుగుతోంది.
తాజాగా ఐటూకనెక్ట్ అనే కంపెనీ ఎన్నికల ప్రచార శైలిలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. టెక్నాలజీని ఉపయోగిస్తూ ఎన్నికల ప్రచార శైలినే మార్చేసింది. ఎన్నికల ప్రచారంలో ఎదురయ్యే అడ్డంకులను అదిగమించడంలో ఐటూకనెక్ట్ వ్యూహాత్మకమని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. 2023లో స్థాపించిన ఈ ఐటూకనెక్ట్ సేవలు రాజకీయ నాయకుల అవసరాలను తీరుస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోని ఓటర్లకు నాయకులను చేరవేస్తుంది.
గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల్లో ఐటూకనెక్ట్ అద్భుతమైన ఫలితాలను రాబట్టింది. ఈ క్రమంలోనే రానున్న సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థుల విజయం కోసం నాయకులను తమ ఓటర్లకు చేరువ చేసేందుకు వినూత్న సేవలను చేపట్టింది ఐటూకనెక్ట్.
ఏఐ ఆధారిత వాయిస్ కాల్స్..
ఐటూకనెక్ట్ అభ్యర్థులకు సంబంధించిన సందేశాన్ని ఏఐ ఆధారిత వాయిస్ కాల్స్ రూపంలో నేరుగా ఓటర్లకు చేరవేస్తారు. భారత దేశంలో ఇలాంటి సేవలు అందిస్తున్న తొలి సంస్థ ఇదే కావడం విశేషం.
వాట్సాప్ సందేశాల ద్వారా..
ఐటూకనెక్ట్ ద్వారా ఓటర్లకు నేరుగా వాట్సాప్ ద్వారా మెసేజ్‌లను పంపిస్తారు. ఇందుకోసం నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల వాట్సాప్ నెంబర్లను సేకరిస్తారు.
మొబైల్ యాప్, డాష్ బోర్డ్..
ఐటూకనెక్ట్ మొబైల్ యాప్‌తో పాటు డాష్ బోర్డ్‌ను కూడా అందిస్తోంది. దీని ద్వారా సేవలను చాలా సులభంగా పొందొచ్చు.
రానున్న ఎన్నికల్లో భారతదేశం అంతా అభ్యర్థులను బలపరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు దీని నిర్వాహకులు చెబుతున్నారు. అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా తమ సేవలు ఉంటాయని వివరిస్తున్నారు. పూర్తి వివరాల కోసం https://itoconnect.com వెబ్ సెట్ లేదా 918263960960 నెంబర్‌ను సంప్రదించండి.
