తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఆదాయపన్ను అధికారులు దాడులు మొదలయ్యాయి. మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ సంస్థలు, సినిమా సంస్థల్లో సోదాలు చేసిన IT అధికారులు తాజాగా ప్రముఖ వస్త్ర దుకాణాలపై దృష్టి సారించారు. పెద్ద మొత్తంలో ఆదాయ పన్ను ఎగవేశారనే ఆరోపణలపై కళామందిర్, కాంచీపురం సిల్క్స్, వరమహాలక్ష్మి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్స్, వాటి యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒక్క హైదరాబాద్‌లోనే 40 చోట్ల సోదాలు చేపట్టారు. కళామందిర్ షాప్ డైరెక్టర్ల ఇళ్లలోనే ఈ సోదాలన్నీ జరుగుతున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం ఆరు గంటలకే డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్ ఇళ్లకి ఐటీ అధికారులు చేరుకున్నారు. నాలుగు గంటలుగా ఇద్దరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖ షాపుల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు.
కళామందిర్, వరమహాలక్ష్మి, కాంచీపురం, KLM ఫ్యాషన్ సంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. 20కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సోదాలు నిర్వహించారు. 40 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు.. కళామందిర్ గ్రూప్ ఛైర్మన్, డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. ఆదాయ పన్ను పెద్ద మొత్తంలో ఎగవేశారని ఆరోపణల నేపథ్యంలో.. అధికారులు నేడు సోదాలు నిర్వహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..