Hyderabad: హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. ఫార్మా, ఇన్‌ఫ్రా కంపెనీల్లో ఆకస్మిక తనిఖీలు..

|

May 24, 2023 | 7:43 AM

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫార్మా, ఇన్‌ఫ్రా కంపెనీలపై ఐటీ దాడులు చేశారు. మొత్తం 20 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగవేతకు సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు.. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.

Hyderabad: హైదరాబాద్‌లో ఐటీ దాడులు.. ఫార్మా, ఇన్‌ఫ్రా కంపెనీల్లో ఆకస్మిక తనిఖీలు..
Income Tax Office
Follow us on

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫార్మా, ఇన్‌ఫ్రా కంపెనీలపై ఐటీ దాడులు చేశారు. మొత్తం 20 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ ఎగవేతకు సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు.. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.

గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..

ఇదిలాఉంటే.. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ రైతు బజార్‌లో నకిలీ విత్తనాలు కలకలం సృష్టించాయి. భారీ ఎత్తున నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు టాస్క్‌ ఫోర్స్ పోలీసులు. ఈ నకిలీ విత్తనాల వ్యవహారంలో ఎస్టేట్ ఆఫీసర్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముఠా నుంచి రెండున్నర లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను సీజ్ చేశారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..