Komatireddy: కోమటిరెడ్డి కుటుంబం నుంచి మరోకరు రాజకీయాల్లోకి వస్తున్నారా..? పార్లమెంటు బరిలో నిలవనున్నారా..?

లోక్ సభ ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. దీంతో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వారసుల రాజకీయ అరంగ్రేటానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు తమ వారసులు, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయనకు రాజకీయ దిగ్గజంగా పేరుంది. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి ఇద్దరు చట్ట సభల్లో ఉన్నారు. ఒకరు ఏకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Komatireddy: కోమటిరెడ్డి కుటుంబం నుంచి మరోకరు రాజకీయాల్లోకి  వస్తున్నారా..? పార్లమెంటు బరిలో నిలవనున్నారా..?
Komatreddy Family
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jan 04, 2024 | 3:14 PM

కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఆ జిల్లా రాజకీయాల్లోకి సీనియర్ నేత కుటుంబం నుంచి మరోకరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న రాజకీయ ఉద్దండ కుటుంబం నుంచి పార్లమెంటు బరిలో నిలవనున్నారా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా ఆ బడా నేత పావులు కదుపుతున్నారట. జిల్లా రాజకీయాల్లో ఆదిపత్యం కోసమే కుటుంబాన్ని బరిలో దించుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ జిల్లా ఏది..? ఆ బడా నేత ఎవరు..? ఓ లుక్కేద్దాం..!

లోక్ సభ ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. దీంతో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వారసుల రాజకీయ అరంగ్రేటానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు తమ వారసులు, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయనకు రాజకీయ దిగ్గజంగా పేరుంది. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి ఇద్దరు చట్ట సభల్లో ఉన్నారు. ఒకరు ఏకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా కుటుంబం మరొకరిని రాజకీయాల్లోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. పార్టీ పెద్దల ఆశీర్వాదంతో రాజకీయ అరంగ్రేటానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ను పరిచయం చేయాల్సిన పనిలేదు. వారే ఉమ్మడి న‌ల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ త‌మకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాండ్ ఇమేజ్.. నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు ఆయువుపట్టు లాంటిది. దశాబ్దాలుగా మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ దిగ్గజాలుగా పేరుంది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపులో కోమటిరెడ్డి బ్రదర్స్ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర మంత్రిగా, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో హేమ హేమీలైన.. మాజీ టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఉద్ధండ నేతలు ఉన్నా.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ది రూటే సెపరేటు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ అనుచరులను గెలిపించుకుని జిల్లా రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టు సాధించారు. తాజాగా కోమటిరెడ్డి కుటుంబం నుంచి మరొకరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట.

ఈ నేపథ్యంలో భువనగిరి పార్లమెంట్‌ సీటు కోసం ‘కోమటిరెడ్డి’ కుటుంబం రంగంలోకి దిగింది. కోమటిరెడ్డి బ్రదర్స్.. పెద్దన్న కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి తనయుడు సూర్య పవన్‌ రెడ్డి భువనగిరి ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. అందులో భాగంగా నూతన సంవత్సరం పురస్కరించుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి కోమటిరెడ్డి మోహన్‌ రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని కలువడం చర్చనీయాంశంగా మారింది. భువనగిరి ఎంపీగా పోటీ చేసేందుకు తనయుడు సూర్య పవన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారట.

ఇప్పటికే భువనగిరి నుంచి 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఎంపీలుగా విజయం సాధించారు. ఈ పార్లమెంటు నియోజక వర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు గట్టిపట్టు ఉంది. నియోజకవర్గంలో కోమటిరెడ్డి కుటుంబానికి బలమైన క్యాడర్ తోపాటు బలమైన బంధు వర్గం ఉంది. 20 ఏళ్లుగా డాక్టర్ గా సేవలు అందిస్తున్న సూర్య పవన్ రెడ్డికి మంచి పేరుంది. కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గోపాలాయిపల్లి ఆలయ చైర్మన్ గా పలు సామాజిక సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో జనగామ మినహా నకిరేకల్, మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం నియోజక వర్గాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. భువనగిరి నుంచి కోమటిరెడ్డి సూర్య పవన్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరీ అధిష్టానం వద్ద కోమటిరెడ్డి బ్రదర్స్ మరోసారి పంతం నెగ్గించుకుంటారో లేదో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
అవును, నా భార్తకు ఆ్రలెడీ పెళ్లైంది.. తప్పేంటి.? వరలక్ష్మీ
అవును, నా భార్తకు ఆ్రలెడీ పెళ్లైంది.. తప్పేంటి.? వరలక్ష్మీ
దాహంతో అల్లాడిన ఆవు.. చలివేంద్రం వద్ద నీళ్లు తాగుతున్న ఆవు వీడియో
దాహంతో అల్లాడిన ఆవు.. చలివేంద్రం వద్ద నీళ్లు తాగుతున్న ఆవు వీడియో
'ఆస్తుల కోసమే పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టారు'.. పోతిన మహేష్ ఆరోపణ
'ఆస్తుల కోసమే పవన్‌కల్యాణ్‌ పార్టీ పెట్టారు'.. పోతిన మహేష్ ఆరోపణ
రాత్రిపూట చల్లటి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? ఇది తెలిస్తే ..
రాత్రిపూట చల్లటి నీళ్లతో స్నానం చేస్తున్నారా..? ఇది తెలిస్తే ..
క్రెడిట్ స్కోర్ తక్కువున్నా పర్లేదు.. ఇలా చేస్తే పర్సనల్ లోన్
క్రెడిట్ స్కోర్ తక్కువున్నా పర్లేదు.. ఇలా చేస్తే పర్సనల్ లోన్
ఎన్టీఆర్ కోసమే ఫస్ట్ టైం అలా చెయ్యాల్సి వచ్చింది. కాజల్ కామెంట్స్
ఎన్టీఆర్ కోసమే ఫస్ట్ టైం అలా చెయ్యాల్సి వచ్చింది. కాజల్ కామెంట్స్
మారిన క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి.!
మారిన క్రెడిట్‌ కార్డ్‌ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి.!
ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.!
ఆ స్టార్ హీరో సినిమాకు నో చెప్పిన శ్రీలీల.!
'తెలంగాణలో 10 స్థానాలకు పైగా గెలవబోతున్నాం'.. కేంద్ర మంత్రి..
'తెలంగాణలో 10 స్థానాలకు పైగా గెలవబోతున్నాం'.. కేంద్ర మంత్రి..
పెరుగుతో ఇవి కలిపి తిన్నారంటే.. ఇక అంతే.!
పెరుగుతో ఇవి కలిపి తిన్నారంటే.. ఇక అంతే.!