Telangana: ఆ జిల్లాలో అంతా అతివల పాలనే.. రాణీ రుద్రమదేవి ధీరత్వాన్ని చాటుతున్న నారీమణులు.

వరంగల్ జిల్లా పరిపాలనలో 80% మహిళలు ఉన్నారు. మంత్రులు, కలెక్టర్లు, IPS అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారుల్లో మహిళలే ఎక్కువ. రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పునరుద్ధరించినట్లుగా, ఈ మహిళలు పరిపాలనలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ మహిళా శక్తి వల్ల జిల్లా అభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా మహిళా సాధికారత గురించి ప్రత్యేక కథనం.

Telangana: ఆ జిల్లాలో అంతా అతివల పాలనే.. రాణీ రుద్రమదేవి ధీరత్వాన్ని చాటుతున్న నారీమణులు.
Warangals Women Power

Edited By: Surya Kala

Updated on: Mar 08, 2025 | 12:46 PM

అక్కడ నారీశకం నడుస్తోంది.. యాద్రేశ్చికమో..? లేక పాలకుల ప్రయోగమో..? ఏమో కానీ..ఆ జిల్లా సారదులంతా అతివలే.. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, IPSలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులలో సహా 80 శాతం మహిళలే.. రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఆ నారీ మణులు పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుతున్నారు.. మహిళాశక్తిని చాటుతున్న ఆ జిల్లాలో అతివల పాలన ఎలా సాగుతుంది..?అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓరుగల్లు ఉమెన్ పవర్ పై స్పెషల్ స్టోరీ…

పోరాటాల పురిటిగడ్డ వరంగల్ ఇప్పుడు మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది.. రాణీ రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఇక్కడి నారీమణులు పరిపాలనలో స్త్రీ శక్తిని చాటుతున్నారు. బహుశా దేశంలో ఏ జిల్లాకు లేని ఓ అపురూప చరిత్ర ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా స్వంతం చేసుకుంది.. ఇక్కడ అంతా అతివలే సారథులు.. చట్ట సభల్లో, అధికార పాలనలోనూ అతివలె శాసిస్తున్నారు.. ఇక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులలో 80 శాతం మహిళలే…

ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులు ఉండగా.. ఆ ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ వరంగల్ జిల్లా వాసులే కావడం విశేషం… ఈ ఇద్దరు మహిళా ఫైర్ బ్రాండ్ లు ఇప్పుడు రాష్ట్రంలోనే స్పెషల్ అట్రాక్షన్ గా మారారు.. పరిపాలనలో వారి ప్రత్యేకతను చాటుతున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ జిల్లా నుండి సీతక్క, సురేఖ, యశస్వినిరెడ్డి ముగ్గురు మహిళలు గెలుపొందగా ఇద్దరు మహిళా ఫైర్ బ్రాండ్ లు మంత్రులయ్యారు.. 26 ఏళ్ల అతిచిన్న వయస్సులో MLA అయిన యశస్వినిరెడ్డి అసెoబ్లీలో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు..

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం వరంగల్ ఎంపీ గా కడియం కావ్య కొనసాగుతున్నారు..40 ఏళ్ల తర్వాత వరంగల్ ఎంపీగా ఒక మహిళ Dr కడియం కావ్య గెలుపొంది స్త్రీ శక్తిని చాటారు..గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా గుండు సుధారాణి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. గతంలో వరంగల్ మేయర్ గా బాధ్యతలు నిర్వహించిన ఎర్రబెల్లి స్వర్ణ ప్రస్తుతం వరంగల్ DCC ప్రెసిడెంట్ గా పార్టీ బాధ్యతలు సమర్ధ వంతంగా నిర్వహిస్తున్నారు..

వరంగల్ జిల్లా కలెక్టర్ గా సత్యశరదాదేవి, హనుమకొండ జిల్లా కలెక్టర్ గా ప్రావీణ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అశ్విని తానాజీ వాకడే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. సెంట్రల్ జోన్ డీసీపీ గా సలీమా IPS అధికారిని బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. ఇలాంటి చారిత్రక జిల్లాలో పరిపాలన పగ్గాలు తమ చేతులమీదుగా నిర్వహించడం ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

వీళ్ళేకాదు..నలుగురు అదనపు కలెక్టర్లు మహిళా అధికారులే కావడం విశేషం… మరోవైపు జిల్లా ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయస్థానం లోనూ మహిళలే న్యాయమూర్తులుగా ఎక్కువగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు..మామునూర్ PTC ( పోలిస్ ట్రైనింగ్ క్యాంప్) కమండెంట్ గా IPS అధికారిని పూజా బాధ్యతలు నిర్వహిస్తున్నారు..

ఇక ఉద్యోగులలోనూ మహిళలదే పై చేయి…రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని స్త్రీ శక్తిని చాటుతున్న ఈ జిల్లాపై రాష్ట్ర ముఖ్యమంత్రి మరో ప్రయోగం చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో కూడా వరంగల్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఎర్రబెల్లి స్వర్ణకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది.. గతం లో మేయర్ గా పనిచేసిన ఎర్రబెల్లి స్వర్ణ తనకు ఏ బాధ్యతల అప్పగించిన మచ్చ రాకుండా బాధ్యతలు నిర్వహిస్తానంటున్నారు.

ఇందుగలరు అందు లేరను సందేహం వలదు అన్నట్లు… అన్ని విబాగాలలో మహిళలే సారదులుగా వరంగల్ ఉమ్మడి జిల్లా పరిపాలనా పగ్గాలు వారి చెక్కుచేతుల్లో పెట్టుకొని నడిపిస్తున్నారు.. రాణీ రుద్రమదేవి వారసత్వాన్ని చాటుతూ స్త్రీ శక్తిని చాటుతున్న ఈ నారీ మణులు అన్ని రంగాల్లో సక్సెస్ సాధిస్తూ నారీ భేరి ముగిస్తున్నారు.. వీరిని చూసి ఓరుగల్లు మహిళలు అంతా గర్వంగా భావిస్తున్నారు. నేడు అంతర్జతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఈ మహిలమనులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు..

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..