Hyderabad racing: హుస్సేన్‌సాగర్‌ తీరంలో నేడు అసలైన రేసింగ్‌ మజా.. 9 గంటలకు మొదలుకానున్న రేస్‌..

హుస్సేన్ సాగర్‌ తీరంలో హైఓల్టేజ్‌ రేస్‌ అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో 2వ రోజు అసలు సిసలైన మజా రాబోతోంది.

Hyderabad racing: హుస్సేన్‌సాగర్‌ తీరంలో నేడు అసలైన రేసింగ్‌ మజా.. 9 గంటలకు మొదలుకానున్న రేస్‌..
Indian Racing League

Updated on: Nov 20, 2022 | 8:50 AM

హుస్సేన్ సాగర్‌ తీరంలో హైఓల్టేజ్‌ రేస్‌ అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో 2వ రోజు అసలు సిసలైన మజా రాబోతోంది. ఇవాళ 9 గంటల నుంచి రేస్‌లు మొదలవుతాయి. క్వాలిఫయింగ్‌ రేస్‌ల తర్వాత అసలైన పందెం మొదలవుతుంది. 10 నిమిషాలు ఫార్ములా -4 క్వాలిఫయింగ్ రేస్ ఉంటుంది. క్వాలిఫయింగ్ రేస్‌ల తరువాత ఫార్ములా-4 లో రేస్ – 1 ఉంటుంది. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో 12 కార్లు, 6 జట్లు పాల్గొంటున్నాయి. ట్రాక్‌పై రేస్ కార్లను రయ్‌మనిస్తున్నారు 24 మంది డ్రైవర్లు.

అయితే, హైదరాబా‌ద్ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో రేసర్లు చేస్తున్న స్టంట్స్‌ కూడా వావ్‌ అనిపిస్తున్నాయి. కళ్లు చెదిరే స్పీడ్‌లో వాళ్ల యాక్షన్‌ చూస్తే అదుర్స్ అనకుండా ఉండలేం. నిన్న కొత్త ట్రాక్‌పై రేస్‌లు కాస్త స్లోగా మొదలైనా ఇప్పుడు మ్యాగ్జిమమ్‌ స్పీడ్‌కి చేరాయనే చెప్పాలి. శనివారం నాడు హుస్సేన్ సాగర తీరానా ఇండియన్ రేసింగ్ లీగ్ అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. 2.8 కి.మీ ఉన్న ట్రాక్‌పై 240 కి.మీ వేగంతో 40 నిమిషాల పాటు 12 రేసింగ్‌ కార్లు రయ్య్‌మ్రంటూ దూసుకెళ్లాయి. ఐమ్యాక్స్‌ వద్ద మొదలైన క్వాలిఫైయింగ్‌ రేస్‌ను మంత్రి కేటీఆర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కాసేపు ఆయన కూడా కార్ రేసింగ్‌ను చూశారు. ఇక ఈ రేసింగ్‌ను చూసేందుకు వచ్చిన సందర్శకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. రెప్పపాటులో వచ్చిపోతున్న కార్లను చూసి త్రిల్ అవుతున్నారు. పోటీల అనంతరం రేసింగ్ కార్లతో సెల్ఫీలు దిగుతూ ముచ్చటపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

పకడ్బందీ ఏర్పాట్లు..

ఇండియన్ రేసింగ్ లీగ్‌లో ఎలాంటి దుర్ఘటను జరుగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రేస్ కార్ల కదలికలను గమనించేందుకు 2.8 కిలోమీటర్ల ట్రాక్ చుట్టూతా 47 కెమెరాలను ఏర్పాటు చేశారు. కార్ల వేగం, రాకపోకలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేశారు. రేసింగ్‌‌లో సహాయక చర్యల కోసం 6 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. రేసింగ్‌ సందర్భంగా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సహాయం అందించేందుకు మెడికల్ ఎమర్జెన్సీ టీమ్‌లు, ఫైర్ సేఫ్టీ టీమ్‌లు, వాహానాన్ని సెకన్లలో ట్రాక్ నుంచి పక్కకు తీసుకెళ్లే వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..