Anil Boinapalli: అమెరికాలో తెలుగోడికి అరుదైన గౌరవం.. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన వరంగల్ వాసి

|

Mar 10, 2024 | 12:49 PM

తెలంగాణవాసికి అరుదైన గౌరవం దక్కింది. వర్జీనియాలో నివాసముంటోన్న అనిల్ బోయిన పల్లి అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నారు. వ్యాపార రంగంలో అంచెలంచెలుగా రాణిస్తోన్న అనిల్ ఇండియన్‌ అమెరికన్‌ 2024 స్మాల్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యారు

Anil Boinapalli: అమెరికాలో తెలుగోడికి అరుదైన గౌరవం.. ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన వరంగల్ వాసి
Anil Boinapalli
Follow us on

తెలంగాణవాసికి అరుదైన గౌరవం దక్కింది. వర్జీనియాలో నివాసముంటోన్న అనిల్ బోయిన పల్లి అమెరికా ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకోనున్నారు. వ్యాపార రంగంలో అంచెలంచెలుగా రాణిస్తోన్న అనిల్ ఇండియన్‌ అమెరికన్‌ 2024 స్మాల్‌ బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. తాజాగా యునైటెడ్‌ స్టేట్స్‌ స్మాల్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌, నేషనల్‌ స్మాల్‌ బిజినెస్‌ వీక్‌ అవార్డు-2024 గ్రహీతలను ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు తమ వంతు ప్రోత్సాహం, సహకారం అందించినందుకు గానూ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్కై సొల్యూషన్స్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడుగా, సీఈవోగా ఉన్న బోయినపల్లి అనిల్‌ వర్జీనియా రాష్ట్రం నుంచి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. వర్జీనియాకు చెందిన హెర్న్‌డాన్‌ కంపెనీతో కలిసి 2008లో స్కై సొల్యూషన్స్‌ సంస్థను ఏర్పాటుచేశారు అనిల్ బోయిన పల్లి. బిజినెస్ వ్యవహారాల్లో సాంకేతిక అంశాలకు సంబంధించిన సేవలను ఈ సంస్థ అందిస్తోంది.

“దక్షిణ భారతదేశంలోని మారుమూల గ్రామం నుండి వచ్చిన నాకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అఅమెరికా వంటి గొప్ప దేశంలో ఈ అవార్డు రావడం ఇక్కడ మనకు లభించిన అవకాశాలను ఉదాహరణగా చూపుతుంది’అని అనిల్ హర్షం వ్యక్తం చేశాడు. అనిల్ బోయినపల్లి విషయానికి వస్తే  వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలం సీఎన్‌ఎస్‌ఐ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పని చేశారు. ఇందులో హెల్త్‌కేర్‌ ఇండస్ట్రీలో సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ విధులను సమర్థంగా నిర్వర్తించారు. అంతకుముందు ఫెన్నీ మే, హారిస్‌ కార్పొరేషన్‌లో కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. NSBW అవార్డుల ప్రదానోత్సవం ఏప్రిల్‌ 28, 29 తేదీల్లో వాషింగ్టన్‌ డీసీలోని వాల్డోర్స్‌ ఆస్టోరియా హోటల్‌లో జరగనుంది. SBA అడ్మినిస్ట్రేటర్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ క్యాబినెట్‌లో సభ్యుడైన ఇసాబెల్‌ కాసిల్లాస్‌ గుల్మాన్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ఈ అవార్డులను ప్రదానం చేస్తారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…