AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య ఆస్ట్రేలియాలో.. భర్త హైదరాబాద్‌లో.. రోడ్డు పక్కన చెత్త డబ్బాలో లభ్యమైన శవం..

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళల వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాకు చెందిన వైద్యురాలు ఉజ్వల ట్రెకింగ్‌కు వెళ్లి లోయలో పడి మృతిచెందింది. ఆ విషాద ఘటన మరువకముందే మరో ఘోరం జరిగింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని బక్లీ ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన వివాహత హత్యకు గురైంది. రోడ్‌ పక్కన ఉన్న ఓ దాబా హోటల్‌లో మహిళను చంపేసినట్లు గుర్తించారు పోలీసులు

భార్య ఆస్ట్రేలియాలో.. భర్త హైదరాబాద్‌లో.. రోడ్డు పక్కన చెత్త డబ్బాలో లభ్యమైన శవం..
Hyderabad Woman Murder
Shaik Madar Saheb
|

Updated on: Mar 10, 2024 | 12:18 PM

Share

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళల వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాకు చెందిన వైద్యురాలు ఉజ్వల ట్రెకింగ్‌కు వెళ్లి లోయలో పడి మృతిచెందింది. ఆ విషాద ఘటన మరువకముందే మరో ఘోరం జరిగింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని బక్లీ ప్రాంతంలో హైదరాబాద్‌కు చెందిన వివాహత హత్యకు గురైంది. రోడ్‌ పక్కన ఉన్న ఓ దాబా హోటల్‌లో మహిళను చంపేసినట్లు గుర్తించారు పోలీసులు. మృతురాలు హైదరాబాద్‌ AS రావు నగర్‌ వాసి శ్వేతగా నిర్ధారించారు. శ్వేత మృతికి భర్తే కారణమని అనుమానిస్తున్నారు బంధువులు. శ్వేత భర్త కొడుకుతో కలిసి హైదరాబాద్‌లో ఉండడం.. శ్వేత ఆస్ట్రేలియాలో హత్యకు గురికావడం అనుమానాలకు తావిస్తోంది. హత్య వెనుక భర్త హస్తంపై బంధువుల అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

అయితే, శ్వేత మృతదేహం శనివారం ఒక డబ్బాలో లభించినట్లు ఆస్ట్రేలియా పోలీసులు తెలిపారు. దుండగులకు శ్వేతతో పరిచయం ఉందని విక్టోరియా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి వేరే దేశానికి పారిపోయారు. శ్వేత భర్త తమ మూడేళ్ల కుమారుడితో సహా హైదరాబాద్ వెళ్లిపోయారని మెల్‌బోర్న్‌లోని ఓ వార్తా ఛానెల్ ప్రసారం చేసింది. హత్యకు గల కారణాలను పోలీసులు ఇంకా నిర్ధారించలేదు.. ఈ ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, ఆస్ట్రేలియాలో మహిళల హత్యపై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. శ్వేత హత్యతో కలిపి ఈ ఏడాది హత్యకు గురైన వారి సంఖ్య 18కి చేరినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌