V Hanumanta Rao: ఎంపీ టిక్కెట్ రాకుండా భట్టి విక్రమార్క అడ్డుపడుతున్నారు..! కంటతడి పెట్టిన వీహెచ్
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో సీట్ల కాక మొదలైంది.. ఎలాగైనా సీటు దక్కించుకునేందుకు ఇప్పటికే కొందరు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు.
లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో సీట్ల కాక మొదలైంది.. ఎలాగైనా సీటు దక్కించుకునేందుకు ఇప్పటికే కొందరు అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అవకాశం ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించారు. పార్టీలో పరిస్థితిని వివరిస్తూనే.. ఖమ్మం ఎంపీగా తనకు ఈసారైనా ఛాన్స్ ఇస్తే గెలుస్తానన్నారు. ఖమ్మం ఎంపీగా పోటీ చేయకుండా తన పేరు లిస్ట్‌లో లేకుండా చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టార్గెట్ చేశారు వీహెచ్ హనుమంతరావు.. ఈసారి ఎంపీ టికెట్ ఇస్తే గెలుస్తానంటూ వీహెచ్ వివరించారు. తన మీద ఎందుకీ కక్ష అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు లోకల్ అంటున్నారు.. ఇదివరకు గెలిచిన వారంతా లోకలా ..? అంటూ ప్రశ్నించారు.
భట్టి విక్రమార్క ఈస్థాయికి రావడంలో తన పాత్ర ఉందని పేర్కొన్న వీహెచ్ హనుమంతరావు.. ఇప్పుడు తనకు ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వకుండా భట్టి ఎందుకు అడ్డుపడుతున్నారంటూ ప్రశ్నించారు. 2019లో భట్టి విక్రమార్క కనీసం తన పేరును కూడా అధిష్ఠానానికి పంపలేదన్నారు వీహెచ్.
ప్రజలకు సేవ చేయాలన్నదే తన తపన అని.. తన వయసు మించిపోలేదని తనలాగా చురుగ్గా పార్టీలో పనిచేసే నేత ఎవరూ లేరని వీహెచ్ కంట కన్నీరు పెడుతూ గద్గద స్వరంతో మాట్లాడారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..