CM Jagan: మేదరమెట్లలో సిద్ధం సభకు పోటెత్తిన జనం
సిద్ధం సభలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. వైసీపీ కేడర్‌లో ఉత్తేజాన్ని నింపుతుంటే.. ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఇప్పటిదాకా మూడు సిద్ధం సభలు జరిగాయి. మొదటిది విశాఖ భీమిలిలో.. రెండోది ఏలూరు దెందులూరులో.. మూడోది అనంతపురం రాఫ్తాడులో జరిగింది. ఈ మూడు సభలకు లక్షలాది మంది జనం తరలివచ్చారు. ఇక నాలుగో సిద్ధం సభ మేదమెట్లలో జరిగింది. ఈ సభలో సీఎం ప్రసంగం...
అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో సిద్ధం సభ భారీగా జరిగింది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల క్యాడర్‌ని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో ఈ సిద్ధం సభ నిర్వహించింది వైసీపీ. దాదాపు పదిహేను లక్షల మంది కార్యకర్తలు మెదరమెట్ల సభకి హాజరయ్యారు. సిద్ధం తొలి సభను ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం పరిధిలో.. రెండో సభను ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి దెందులూరు నియోజకవర్గ సమీపంలో.. మూడో సభను రాయలసీమ జిల్లాలకు సంబంధించి అనంతపురం రాప్తాడులో భారీ ఎత్తున నిర్వహించారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి పరిధికి సంబంధించి బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో నాల్గో సభను.. ఆఖరి సిద్ధం సభగా నిర్వహించారు. భీమిలీ, దెందులూరు, రాప్తాపాడులో జరిగిన సభలు రాష్ట్రంలో వైసీపీ దమ్మును, ప్రజాదరణను తెలియజేయగా.. ఈ నాలుగో సభ కూడా ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా నిర్వహించింది వైసీపీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..