Telangana: మొన్న పులి.. నేడు ఏకంగా చిరుతల మంద హల్‌చల్.. భయం భయంగా బతుకులు..

|

Nov 26, 2022 | 1:13 PM

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భయం.. భయం.. మొన్న పులులు, ఇవాళ చిరుతలు.. ఒకటి, రెండు కాదు..గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో హడలిపోతున్నారు స్థానికులు. ఇటీవల భీంపూర్‌..

Telangana: మొన్న పులి.. నేడు ఏకంగా చిరుతల మంద హల్‌చల్.. భయం భయంగా బతుకులు..
Leopard
Follow us on

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భయం.. భయం.. మొన్న పులులు, ఇవాళ చిరుతలు.. ఒకటి, రెండు కాదు..గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. దీంతో హడలిపోతున్నారు స్థానికులు. ఇటీవల భీంపూర్‌ మండలం గుంజాల దగ్గర పులుల గుంపు స్థానికుల కంట పడింది. తాజాగా కాగజ్‌నగర్‌ కారిడార్‌లో కెమెరాకు చిక్కింది మూడు చిరుతల గుంపు. కొమురం భీమ్‌ జిల్లాలో వారం రోజుల పాటు వణికించింది A-3. ఐతే అది ప్రాణహిత దాటి మహారాష్ట్రలోకి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. కానీ మళ్లీ టెన్షన్‌ మొదలైంది. ఈసారి చిరుతల గుంపు కెమెరాలకు చిక్కింది. A-3 కోసం అమర్చిన ట్రాప్‌ కెమెరాల్లో..3 చిరుతలు కనిపించాయి. దీంతో అంకుశాపూర్‌, కోసిని, కాగజ్‌నగర్‌ కారిడార్‌ సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అటవీ అధికారులు.

ఇదిలాఉంటే.. ఒకటిపోతే మరొకటి అన్నట్లుగా అదిలాబాద్‌లో నిత్యం కనిపిస్తున్నాయి పులులు. జిల్లా ప్రజలను పులుల భయం వదలడం లేదు. తాజాగా భీంపూర్ మండలం గుంజాల శివారులో పులి సంచారం భయపెడుతోంది. వరుర్ సమీపంలోని భైరవగుట్ట వద్ద రోడ్డు దాటుతూ స్థానికుల కంటపడింది పులి. కొందరు యువకులు దనోరా నుంచి అర్లి(టి) గ్రామం వైపు బైక్‌పై వెళ్తుండగా పులి కంట పడింది. పులిని చూసి బైక్ వదిలేసి పరుగులు తీసిన యువకులు. పులి భైరవ గుట్టవైపు వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అర్లి(టి), అంతర్గాం, కరణ్ వాడి, కరంజి(టి) వాసులను అప్రమత్తం చేశారు అటవీశాఖ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..