వైఎస్సార్ అనుచరుడు సూరీడుపై దాడి.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన సొంత అల్లుడు.. కారణాలు ఇలా ఉన్నాయి..

Sureedu Attacked By Son in Law : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందిన సూరీడిపై దాడి జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా

వైఎస్సార్ అనుచరుడు సూరీడుపై దాడి.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టిన సొంత అల్లుడు.. కారణాలు ఇలా ఉన్నాయి..
Sureedu Attacked By Son

Updated on: Mar 24, 2021 | 1:18 PM

Sureedu Attacked By Son in Law : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందిన సూరీడిపై దాడి జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెన్నంటే ఉండేవాడు. తాజాగా సొంత అల్లుడే అతడిపై దాడి చేశాడని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.. జూబ్లీహిల్స్‌లోని సూరీడు ఇంటికి వచ్చిన అల్లుడు సురేంద్రనాథ్‌ క్రికెట్‌ బ్యాట్‌తో అతడిపై దాడి చేశాడు. గతంలో సురేంద్రనాథ్‌పై సూరీడు కూతురు గృహహింస కేసు పెట్టింది. దీంతో కేసు ఉపసంహరించుకోవడం లేవని సురేంద్రనాధ్ గతంలో బెదిరింపులకు దిగాడు.

ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చే దాడి చేశాడని తెలుస్తోంది. సూరీడు కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా అతడి కుమార్తె గంగా భవానీని సురేంద్రనాథ్‌ కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన భవానీ పుట్టింటికి వచ్చేసి అతడిపై గృహ హింస కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే భారీ షాక్.. ఐపీఎల్‌కు దూరం కానున్న స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్.!

బిహార్ అసెంబ్లీలో రభస, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బలవంతంగా లాక్కు వెళ్లిన మార్షల్స్, పలువురికి గాయాలు

సినిమా తారలను వదలని కరోనా.. బాలీవుడ్ స్టార్ హీరోకు కోవిడ్ పాజిటివ్.. ఆందోళనలో అభిమానులు

రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన.. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన భర్త.. ఏం చేశాడో తెలిస్తే షాక్..