YS Vijayamma: విజయమ్మ నిరాహార దీక్ష.. కూతురిని చూడనివ్వకుండా ఇలా చేస్తారా అని ఆవేదన..

హైదరాబాద్ మహా నగరంలో రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అరెస్టు కావడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ క్రమంలో కుమార్తెను చూసేందుకు...

YS Vijayamma: విజయమ్మ నిరాహార దీక్ష.. కూతురిని చూడనివ్వకుండా ఇలా చేస్తారా అని ఆవేదన..
Ys Vijayamma
Follow us
Ganesh Mudavath

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 29, 2022 | 5:23 PM

హైదరాబాద్ మహా నగరంలో రాజకీయంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అరెస్టు కావడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ క్రమంలో కుమార్తెను చూసేందుకు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు బయల్దేరిన వైఎస్‌ విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు రానీయకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో షర్మిల అరెస్ట్‌ను నిరసిస్తూ విజయలక్ష్మి లోటస్‌పాండ్‌లో దీక్ష చేపట్టారు. తన కూతురిని వదిలే వరకు దీక్ష చేస్తానని ప్రకటించారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న షర్మిలను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. షర్మిలను కలిసేందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు.

అటు ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌ దగ్గర టెన్షన్‌ కొనసాగుతోంది. షర్మిలను రిమాండ్‌కు తరలిస్తారని తెలుస్తోంది. ఆమె తరపున లాయర్లు పీఎస్‌కు వెళ్లినా ఇంత వరకు షర్మిల బయటకు రాలేదు. స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేస్తారని తొలుత అనుకున్నా ఇప్పటి వరకు ఆమె బయటకు రాకపోవడంతో రిమాండ్‌కు తరలిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఎస్‌ఆర్‌ నగర్‌ పీఎస్‌ దగ్గరకు వచ్చిన అనిల్‌కుమార్‌ బయట అడ్డుకున్నారు పోలీసులు. లోపలకు వెళ్లనివ్వలేదు.

షర్మిలపై మరిన్ని కేసులు..

షర్మిలపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజ్‌భవన్‌ రోడ్డులో కలకలం సృష్టించిన వైఎస్‌ షర్మిల కారును.. షర్మిలతో సహా పోలీసులు లిఫ్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని షర్మిలను విడుదల చేయాలని కార్యకర్తలు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు. లోపలికి రాకుండా బారీకేడ్లు అడ్డుపెట్టారు. ప్రజల కోసం పోరాడుతుంటే తనను బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారని షర్మిల మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

ప్రగతి భవన్ వద్ద నిరసనకు యత్నం..

సోమవారం జరిగిన పరిణామాలకు నిరసనగా వైఎస్ షర్మిల ప్రగతిభవన్‌కు బయల్దేరారు. నర్సంపేటలో ధ్వంసం చేసిన కారులో స్వయంగా డ్రైవ్‌ చేసుకుని నిరసనకు వెళ్తుండగా పంజాగుట్ట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కారు దిగాలని పోలీసులు కోరినప్పటికీ ఆమె వినలేదు. ధ్వంసమైన కారు డ్రైవింగ్‌ సీటులో షర్మిల కూర్చొని ఉండగానే పోలీసుల క్రేన్‌ను తెప్పించి అక్కడి నుంచి ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

నర్సంపేటలో పాదయాత్ర చేసిన సమయంలో తమ ఎమ్మెల్యేను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పాదయాత్రను నిలిపివేయాలని నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు కోరారు. దీనికి ఆమె నిరాకరించారు. శంకరాం తండా సమీపంలో నిలిపిన షర్మిల కారవాన్‌పై కొందరు వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. పక్కనే ఉన్న ఇన్నోవా వాహనం అద్దాలనూ పగలగొట్టారు. అనంతరం షర్మిలను హైదరాబాద్‌ తరలించారు.

వైఎస్ విజయమ్మ నిరాహార దీక్ష..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..