Womens Day 2022: మహిళా దినోత్సవం స్పెషల్.. హైదరాబాద్‌లో తొలిసారిగా మహిళకు పోలీస్ స్టేషన్ బాధ్యతలు..
వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' ఘనంగా జరుపుకొంటున్నారు.
వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ (Hyderabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా. హైదరాబాద్ పోలీస్ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళా సీఐకి అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని లాలాగూడ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో (స్టేషన్ హౌస్ ఆఫీసర్)గా మధులత బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సమక్షంలో మధులత బాధ్యతలు చేపట్టారు స్వీకరించారు. కాగా మధులత ఇప్పటివరకు వరకు సౌత్ జోన్ పరిధిలోని పాతబస్తీ ఉమెన్ పోలీసు స్టేషన్‌లో సీఐగా బాధ్యతలు నిర్వర్తించారు. తనను ఎస్‌హెచ్‌వోగా నియమించిన సీపీ సీవీ ఆనంద్‌కు మధులత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మహిళలకు సరైన స్థానం ఇవ్వాలి!
కాగా ఈ సందర్భంగా మాట్లాడిన పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సీవీ ఆనంద్ మహిళలకు సరైన స్థానం, గౌరవం ఇవ్వాలని సూచించారు. ‘ ఒక మహిళా ఎస్‌హెచ్‌వోగా ఎందుకు ఉండకూడదనే ఆలోచన వచ్చింది. అందుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఒక మహిళా ఆఫీసర్‌ను ఎస్‌హెచ్‌వోగా నియమించాం. మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు తగ్గుతున్నాయి.’ అని సీవీ ఆనంద్ చెప్పుకొచ్చారు. కాగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ కాలేజ్ ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. Also Read:AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన.. సంగం బ్యారేజ్ పేరు మారుస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడి
Alia Bhatt: హాలీవుడ్‌లో అడుగుపెట్టిన అలియా.. ఏకంగా ఆమెతో స్ర్కీన్ షేర్ చేసుకోనున్న సీత..
UP Elections 2022: ఉత్తర ప్రదేశ్‌లో ఏడు విడతలుగా పోలింగ్.. తగ్గిన ఓటింగ్ పర్సంటేజ్ దేనికి సంకేతం?