Lady Khiladi: మాయమాటలతో వలలో వేసుకుని డబ్బులు గుంజుతున్న ఖిలాడి లేడీ.. లబోదిబోమంటున్న బాధితులు..

గతంలో ఐదు మంది ఎస్ ఐ లని బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు దండుకున్న కిలాడి లేడి... ఇప్పుడు మరో నయా దందా తో ప్రజలని మోసం చేయటం మొదలుపెట్టింది. ప్రజల్ని మోసం చేసి అందినకాడికి గుంజుకోవడం మొదలుపెట్టింది.

Lady Khiladi: మాయమాటలతో వలలో వేసుకుని డబ్బులు గుంజుతున్న ఖిలాడి లేడీ.. లబోదిబోమంటున్న బాధితులు..
Lady Khiladi
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 08, 2021 | 4:45 PM

Lady Khiladi: గతంలో ఐదు మంది ఎస్ ఐ లని బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు దండుకున్న కిలాడి లేడి… ఇప్పుడు మరో నయా దందా తో ప్రజలని మోసం చేయటం మొదలుపెట్టింది. ప్రజల్ని మోసం చేసి అందినకాడికి గుంజుకోవడం మొదలుపెట్టింది. ఆ కిలాడీ లేడీ చేతిలో మోసపోయిన బాధితులు..తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

కిలాడి లేడి శ్రీలతా రెడ్డి మరో నయా దందాతో ప్రజలని మోసం చేయడం మొదలుపెట్టింది. చిట్టీల పేరుతో అమాయక ప్రజలని గ్రూప్ గా చేసి 5 లేదా 6 నెలలు కట్టించుకున్న తర్వాత చేతులెత్తేస్తోంది. ఇదేంటని ప్రశ్నిస్తే.. బ్లాక్ మెయిల్ చేస్తుందని బాధితులు వాపోతున్నారు. నేను పోలీస్‌లపైనే కేసు పెట్టాను.. మీరెంత అంటూ బెదిరింపులకి పాల్పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. గతంలో శ్రీలతారెడ్డిపై ఎల్బీనగర్, వనస్థలి పురం పోలీస్‌ స్టేషన్ల పరిధుల్లో ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టయి జైలుకు కూడా వెళ్లొచ్చింది. అయితే, డబ్బులు ఉన్న వాళ్లను పరిచయం చేసుకుని మాయమాటలతో వలలో వేసుకుని డబ్బులు లాగి ఇలా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపించారు. ఇలాంటి మాయలేడీపై పీడీ చట్టం నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Blackmail: మాజీ ప్రియురాలి ప్రయివేటు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానంటూ.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజిన ఘనుడు..ఎక్కడంటే..!

Girl Kidnap: నిజామాబాద్‌లో కిడ్నాప్‌ కలకలం.. చిన్నారిని అపహరించేందుకు ప్రయత్నించిన దుండగుడు.. అంతలోనే..